కేంద్రంలో రాజకీయం వేడెక్కింది. నాలుగేళ్ల క్రితం తిరుగులేని మెజార్టీతో అధికార పీఠమెక్కిన మోడీపై అవిశ్వాస తీర్మానాన్ని మొన్నటి వరకూ మిత్రుడిగా ఉన్న టీడీపీనే ప్రవేశ పెట్టటం విశేషం. విభజన హామీలు అమలు చేయలేదన్న ఆగ్రహంతో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన తెలుగు తమ్ముళ్ల కారణంగా మరోసారి విభజన హామీల అంశం తెర మీదకు వచ్చింది.
సంఖ్యాబలాన్ని చూసినప్పుడు మోడీ సర్కారుకు బలం పూర్తిగా ఉన్న నేపథ్యంలో.. ఈ తీర్మానంతో ఎలాంటి రాజకీయ సంచలనం చోటు చేసుకునే అవకాశం లేదు. కమలనాథుల్లో ఈ ధీమా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే.. ఇది కాస్తా అత్యుత్సాహంగా మారుతోంది. అవిశ్వాస తీర్మానం మీద యూపీఏ ఛైర్మన్ సోనియా గాంధీ మాట్లాడుతూ.. అవిశ్వాసం గెలవటానికి అవసరమైన సంఖ్యా బలం ఉందన్న మాటను చెప్పారు.
బీజేపీయేతర శక్తులను కలుపుకొని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ బీరాలు పలికారు. అయితే.. ఇలాంటి మాటలన్నీ విపక్షం నోటి నుంచి కొత్తేం కాదు. తీర్మానం చర్చకు రావటానికి ముందే.. మేం ఓడిపోతామని ఏ నేత చెప్పరు కదా. అదే తీరులో సోనియా నోటి నుంచి గెలుపు మాట వచ్చిందని చెప్పాలి. అయితే.. సోనియా మాటల్ని బీజేపీ నేతలు ఎటకారం చోటుకోవటంలోనే అసలు సమస్యగా చెప్పక తప్పదు.
తాజాగా సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యపై కేంద్రమంత్రి అనంతకుమార్ స్పందించారు. సోనియా జీ.. పాపం మ్యాథ్స్ లో పూర్ అనుకుంటా అంటూ ఎటకారం వ్యాఖ్యలు చేశారు. ముందు వారి పార్టీ ఎంపీల సంఖ్య ఎంత ఉందో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే.. లెక్కల గురించి ఇన్ని మాటలు మాట్లాడిన అనంతకుమార్.. శివసేనను తమ మిత్రపక్షంగా చెప్పుకున్నారు. కొద్దిరోజులుగా బీజేపీకి మాటల షాకులిస్తున్న శివసేనను తమ ఖాతాలో వేసుకుంటున్న అనంతకుమార్ లెక్కల్లో పూరా? సోనియానా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
అధికార పక్షంలో ఉన్న వారికి ధీమా ఉండటం తప్పు కాదు. కానీ..ఆ మాటల్లో అహంకారం కనిపించకూడదన్న విషయాన్ని అనంతకుమార్ తరహా నేతలు మర్చిపోతుంటారు. దీని కారణంగా లేని సమస్యలు తలెత్తుతుంటాయి. సోనియా లెక్కల్లో పూర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై అనంతకుమార్ మాటల్లో అధికార అహంకారం కనిపిస్తోందన్న మాటను చెబుతున్నారు. ఇలాంటి ఇమేజ్ తో కొత్త సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.