భారత్ - చైనా సరిహద్దుల్లో నెలకొన్ని పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు (జూన్ 19) 20 పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ వరుసగా ప్రశ్నలు సంధించారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడ ఉందని నిలదీశారు. ప్రజలు యథాస్థితి పునరుద్ధరించబడుతుందని - వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా తన అసలు స్థానానికి తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నారన్నారు. ఈ విషయంలో కేంద్రం నుండి హామీ కోరుకుంటున్నారన్నారు.
దీనికి సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. లడక్ లోని మన భూభాగంలోకి చైనా దళాలు ఏ రోజు చొచ్చుకు వచ్చాయని - చైనా మన భూభాగంలోకి చేసిన అతిక్రమణలను ప్రభుత్వం ఎప్పుడు గుర్తించిందని - మే 5వ తేదీన లేదా అంతకుముందుగా ఇది జరిగిందా - భారత్-చైనా సరిహద్దుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రభుత్వం స్వీకరించలేదా చెప్పాలన్నారు. వాస్తవానికి ఈ చివరి సమయంలో కూడా ఎన్నో అంశాలు బహిర్గతం కావడం లేదని అభిప్రాయపడ్డారు.
మనం విఫలమయ్యామని - అందుకే ఇరవై మంది జవాన్లను కోల్పోయామని సోనియా గాంధీ అన్నారు. పదుల కొద్ది ఈ ఘటనలో గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలను విపక్షాలు - ప్రజలతో పంచుకోవాలని ప్రధానిని కోరారు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎల్ఏసీ వెంట చోటు చేసుకుంటున్న అసాధారణమైన కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి నివేదించలేదా - మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎల్ ఏసీ వెంబడి భారత్ - చైనా దళాలు చొరబడటం - భారీగా బలగాలను మోహరించడం గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదా - ప్రభుత్వం అభిప్రాయంలో ఏదైనా వైఫల్యం ఉందా చెప్పాలన్నారు.
2013లో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మౌంటేన్ స్ట్రైక్ కార్ప్స్ గురించి కూడా ఆమె నిలదీశారు. ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యతగా చూడాలన్నారు. మే 5వ తేదీన లడఖ్ - ఇతర ప్రాంతాల్లో చైనా చొరబాటు గురించి తెలిసిన వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయవలసి ఉండెనని చెప్పారు.