తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా రాష్ర్టానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ లో మహాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన సోనియాగాంధీ తొలిపలుకుల్లోనే సెంటిమెంట్ రంగరించారు. చాలాకాలం తరువాత తన బిడ్డల్ని చూడటానికి తల్లి ఎంత ఉద్వేగానికి లోనవుతుందో తన మనసులో అలాగే ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో మీకు తెలియంది కాదు. రాష్ట్ర విభజన అంత సులభం కాదనిపించింది. తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని, ఆకాంక్షను గౌరవించి మన్మోహన్ - రాహుల్ విభజన నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. విభజనకు ముందడుగేశాం. ఏపీ ప్రజలు కూడా బాగుండాలని ప్రత్యేక హోదా ప్రకటన చేశాం. దాని కోసం కాంగ్రెస్ ఇప్పటికీ కట్టుబడే ఉందన్నారు.
కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రాన్ని విభజించామని, అయితే తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తూనే.. ఏపీ ప్రజలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సోనియగాంధీ వెల్లడించారు. ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా.. విభజన సమయంలోనే ప్రత్యేక హోదా ప్రకటన చేశామని గుర్తు చేశారు. ఆ ప్రకటనకు ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామన్న సోనియా.. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజలు పోరాడారో... ఇప్పుడా తెలంగాణ చూస్తే మనసుకు బాధ కలుగుతోందన్నారు. నీళ్లు - నిధులు - నియామకాలు అనే నినాదాలతో రాష్ట్రం తెచ్చుకుంటే అందులో ఒక్కటైనా టీఆర్ ఎస్ సర్కారు సఫలీకృత చేయలేదని విమర్శించారు. అందుకే రాష్ట్రం ఇచ్చిన తమను ఆశీర్వదిస్తే తెలంగాణ ప్రజలు కోరుకున్న అభివృద్ధి చేసి చూపిస్తామని... కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు తెలంగాణ చూస్తే మనసకు బాధ కలుగుతోందని సోనియాగాంధీ తెలిపారు. ``ఏ ఆకాంక్షల కోసం మీరంతా తెలంగాణ కోసం పోరాడారో...అలాంటి ఆకాంక్షల విషయంలో నాలుగేళ్లలో జరగలేదు.అది మీక్కూడా అర్థమై ఉంటుంది. మీ కలలు ఎంతవరకు సఫలీకృతమైనాయో మీరే చెప్పండి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో రాష్ట్రం తెచ్చుకుంటే అందులో ఒక్కటైనా టీఆర్ ఎస్ సర్కారు సఫలీకృత చేసిందా అని ప్రశ్నిస్తున్నాను. తెలంగాణలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? కాంగ్రెస్ సర్కారు తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతులను, రైతు కూలీలను కేసీఆర్ సర్కారు దెబ్బతీసింది. భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారు. ఒక కుటుంబం - బంధుమిత్రులు మాత్రమే తెరాస పాలనలో బాగుపడ్డారు.` అని సోనియాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో వేరే రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణ అభివృద్ధిని ఉదాహరణగా చూపించేదాన్నని అయితే, ఇప్పుడు ఇక్కడి పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని సోనియాగాంధీ వెల్లడించారు. ``నిరుద్యోగ యువతకు ఉద్యోగ - ఉపాధి అవకాశాల్లేక నిరాశలో ఉన్నారు. గతంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు మహిళల అభవృద్ధి చూసి మురిసిపోయాను. దళితులు - ఆదివాసులు - అణగారిన వర్గాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అంతా వారి కుటుంబం కోసమే తప్ప నిమ్నవర్గాలకు ఏం చేశారు? తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు.. మీరు సరైన నిర్ణయం తీసుకునే మంచి అవకాశం. ఇది చరిత్రాత్మకమైన సందర్భం. ఇప్పటి మీ నిర్ణయంతోనే తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. మాట మీద నిలబడని వాళ్లను ప్రజలు నమ్మవద్దు. అందుకే భవిష్యత్తు కోసం ఆలోచించి కాంగ్రెస్ కు ఓటేయండి``... అంటూ ముగించారు.