సినిమాల్లో విలన్ వేశాలు వేసే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా కల్లోలం వేళ ఆయన చూపిన ఉదారత, చేసిన సాయాలతో ఎంతో మంది అవసరాలు, ఆకలితీర్చాడు.. అడిగిన వారందరికీ సాయం చేసి గొప్ప మనిషి అనిపించుకున్నాడు. ఎవరికి కష్టమొచ్చినా నేనున్నానని ముందుకొచ్చాడు. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. వలస కూలీలను అయితే సొంత ఖర్చులతో వారి వారి ప్రాంతాలకు తరలించాడు. కొందరు పిల్లల చదువులకు సాయం చేస్తున్నాడు.
తాజాగా సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన 16 నెలల చిన్నారి విహాన్ స్పైనల్ మస్కులర్ ఆత్రోపి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.
వెన్నెముఖ కండరాల క్షీణత ఈ వ్యాధి లక్షణం.. ఈ వ్యాధికి జాల్ గెస్ట్ మా అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో ఉండే ఈ ఇంజక్షన్ ఇవ్వాలంటే రూ.16 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఖరీదైన ఇంజక్షన్ కోసం వారికి తల్లిదండ్రులు విరాళాల సేకరణ చేపట్టారు.
ఇప్పటివరకూ ఈ బాలుడికి సాయం చేసేందుకు బాలీవుడ్ హీరోలు అభిషేక్ బచ్చన్, మనోజ్ బాజ్ పాయి వంటి ప్రముఖులు ముందుకొచ్చాడు. మరోవైపు సోషల్ మీడియాలో సన్నిహితుల ద్వారా ఈ చిన్నారి తల్లిదండ్రుల వివరాలు.. బాలుడి గురించి తెలుసుకున్న సోనూసూద్.. తన వంతు సాయం చేశాడు. మొత్తం రూ.4 కోట్ల విరాళాల్లో సోనూసూద్ అందించిన సాయమే ఎక్కువ. అంతేకాదు.. ఆస్పత్రికి వెళ్లి మరీ చిన్నారిని పరామర్శించారు.
మీడియా సమావేశం నిర్వహించిన సోనూసూద్.. విహాన్ ను బతికించుకోవడానికి ముందుకు రావాలని కోరాడు. క్రౌడ్ ఫండింగ్ వేదికలు.. గోఫండ్ మీలో విరాళాలు అందజేసి లక్ష్యాన్ని చేరుకోవడంలో సాయం చేయండి అంటూ పిలుపునిచ్చాడు.
ఈ బాబు బతకాలంటే 'జాల్ గెస్ట్ మా' అనే ఇంజక్షన్ ఇవ్వాలి. అమెరికాలో ఉండే ఈ ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. గతంలోనూ ఓ చిన్నారికి ఇదే వ్యాధితో పోరాడుతుంటే విరాళాలు సేకరించినా ఆ పాప బతకలేదు.