అత్యాచారాలకు పబ్స్ కారణం కాదన్న సోనూ సూద్

Update: 2022-06-14 17:14 GMT
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిందితులు మైనర్లు అయినా వారు చేసిన పని మాత్రం దారుణమని అందరూ ఖండిస్తున్నారు. నిందితులను మైనర్లుగా పరిగణించొద్దు అని పలువురు సూచిస్తున్నారు.  ఆ జాబితాలో సినీ నటుడు సోనూ సూద్ కూడా చేరారు. కరోనా కాలంలో సాయం చేయాలని కోరితే సోనూసూద్ ఆపన్న హస్తం అందించారు. రియల్ హీరోగా నిలిచారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై సోనూసూద్ స్పందించారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని న్యూస్ లో చూసి షాక్ కు గురయ్యానని చెప్పారు. ఇది చాలా పెద్ద నేరమని.. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదన్నారు. వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పబ్ లు కారణం అవుతున్నాయని అనడం సరైంది కాదని సోనూసూద్ అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం ఆలోచించే విధానంలోనే మార్పు రావాలని అన్నారు. మహిళలు పొట్టి బట్టలు వేసుకున్నారని విమర్శిస్తున్నారని.. మనం ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు మనకు తప్పుడు ఆలోచనలే వస్తాయని తెలిపారు. ముందు మన థింకింగ్ మారాలని సూచించారు.

ఇటు బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నాయని.. దీనిపై నిందితులను పోలీసులు ఆరాతీశారు. బాలిక మెడపై తీవ్రంగా కొరకడం.. రక్కడంతో గాయాలయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే కొరికినట్లు  నిందితులు తెలుపడం విశేషం. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News