ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన `రోబో`సినిమాలో `చిట్టి`పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పనిచేసే ఈ రోబో....తన శక్తి సామర్థ్యాలతో అగ్నిప్రమాదాలలో చిక్కున్న వారిని కాపాడుతుంది....బాంబులను నిర్వీర్యం చేస్తూ - తూటాలకు ఎదురు నిలిచి పోరాడే చిట్టిని సైన్యంలోకి కూడా తీసుకోవాలని టెస్ట్ చేస్తారు. చిట్టి తరహాలోనే నిజ జీవితంలోనూ యుద్ధాలు చేయగలిగే రోబోలుంటే బాగుండు అని అంతా అనుకుని ఉంటాయి. అయితే, చిట్టి తరహాలో రోబో కాదుగానీ....మనుషులతో పని లేకుండా నడిచే సాయుధ వాహనాన్ని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. త్వరలోనే భారత దేశపు తొలి మానవరహిత సాయుధ వాహనం `సూరన్`ను సైన్యాధికారులు పరీక్షించనున్నారు.
గతంలో జరిగిన యుద్ధాల్లో - ప్రస్తుతం పాక్ సరిహద్దులో నిత్యం జరుగుతున్న కాల్పుల్లో వందలాది సైనికులు వీరమరణం పొందారు. అటువంటి సందర్భాల్లోనే సైనికులు చనిపోకుండా ఉండేందుకు`సూరన్`ఎంతగానో ఉపకరిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి `మానవరహిత గ్రౌండ్ వాహనం`(అన్ మ్యాన్న్ డ్ గ్రౌండ్ వెహికల్) త్వరలో పరీక్షలకు సిద్ధంగా ఉంది. భారత సైన్యం వచ్చే నెలలో చెన్నైలో ‘సూరన్’ను పరీక్షించడానికి సన్నాహాలు చేస్తోంది. డిఫెన్స్ ఆటో ఎక్స్ పో 2020లో డిఫన్స్ వారు ప్రదర్శించారు. ‘సూరన్’ సైన్యంలోని ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) ప్రోగ్రామ్ డైరెక్టర్ కల్నల్ అరవింద్ కుమార్ ఈ సరికొత్త ఆవిష్కరణను ప్రదర్శించారు. యుద్ధంలో ప్రాణనష్టాన్ని నివారించేందుకు దాదాపు ఒకటిన్నర సంవత్సరంపాటు పనిచేసిన తరువాత చెన్నైకి చెందిన డెన్నిస్ ఎబెనెజార్ `సూరన్`ను తయారు చేశారు. రిమోట్‌తో టెలి-ఆపరేటెడ్ - మొబైల్ కంట్రోల్ స్టేషన్ నుండి టెలి-ఆపరేటెడ్ - అటానమస్ మోడ్ ద్వారా సూరన్ ను ఆపరేట్ చేయవచ్చు.
500 కిలోల బరువుండే సూరన్...మౌంటెడ్ గన్ టరెట్ కలిగి ఉంటుంది. ఎటువంటి భూభాగంలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే సూరన్.... పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. లాంగ్-రేంజ్ కెమెరాలు - హై-ఎండ్ ప్రాసెసర్లు - కంట్రోలర్లు - సెన్సార్లు - పవర్ బ్యాకప్ మొదలైనవి సూరన్ అదనపు ఆకర్షణలు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - డిఆర్ డిఓ తదితరులు సహా పలువురు వాటాదారులు యుద్ధ యంత్రంపై ఆసక్తి చూపారని ఎబెనెజార్ తెలిపారు. ఆర్మీ చీఫ్ సందర్శించి సూరన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారని ఆయన చెప్పారు. `సూరన్` మోడల్ పై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - డిఆర్ డిఓ ఆసక్తి చూపారు. ఆర్మీ అధికారులు దీనిని అధికారికంగా పరీక్షిస్తే....త్వరలోనే ఇది భారత సైన్యం అమ్ముల పొదిలో చేరే అవకాశముంది.