ప్రస్తుతం ఏపీలో విగ్రహరాజకీయాల వేడి ఇంకా తగ్గలేదు. విగ్రహాల విధ్వంసాలపై కొందరు టీడీపీ, బీజేపీ నేతలు తప్పుడు సమాచారం సోషల్‌మీడియాలో వైరల్ చేశారని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసింది. పాత గుడులు, గతంలో తుఫానులు, ఇతర విపత్తుల వల్ల ధ్వంసమైన గుడులను తాజాగా ఘటనలు జరిగినట్టు కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. అయితే వాళ్లపై ఏపీ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో హనుమాన్ విగ్రహ ధ్వంసంపై తప్పుడు ప్రచారం చేసినట్టు ఓ బీజేపీ నేత స్వయంగా వీడియో విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బీజేపీ కార్యదర్శి కొంతాడ రవిప్రసాద్ విగ్రహ విధ్వంసంపై తాను వైరల్ చేసిన ఫొటోలు, సమాచారంపై తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.
రవిప్రసాద్ ఏమన్నారంటే.. ‘శ్రీకాకుళం జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం అయినట్టు నా మిత్రుడు కొన్ని ఫొటోలు పంపించాడు. దీనిపై నేను నిజనిర్ధారణ చేసుకోకుండానే.. ఈ ఫొటోలను ఇతర గ్రూప్‌లకు ఫార్వార్డ్ చేశాను. అయితే అది రెండేళ్ల క్రితం తిత్లీ తుఫాను కారణంగా దెబ్బతిన్నదని ఆ తర్వాత తెలిసింది. నేను ఈ విషయం తెలుసుకోకుండా నాకు తెలిసిన స్నేహితులకు, ఇతర బీజేపీ గ్రూపుల్లో ఈ ఫొటోలకు కొంత సమాచారం జోడించాను. ఫొటోలు వైరల్ చేశాను.
దయచేసి మిత్రులు, పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. నేను ఇంకోసారి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉంటాను’ అంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో విగ్రహవిధ్వంసాల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఇటీవల డీజీపీ ప్రకటించారు. అయితే విగ్రహవిధ్వంసాల్లో ప్రమేయం ఉందా? లేక తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంలో ప్రమేయం ఉందా? అన్న విషయంపై ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.