ఈ మధ్య క్రికెట్ అభిమానులు తమ హద్దులు మీరుతున్నారు. తమ జట్టు విజయం సాధించగానే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రత్యర్థి జట్లపై తమ ద్వేషాన్ని బహిరంగంగానో, సోషల్ మీడియాలోనో వెళ్లగక్కుతున్నారు. మొన్న బంగ్లాదేశ్ అభిమానులు భారతీయ జెండాను అవమానించిన ఘటన మరువక ముందే పాక్ అభిమానులు తమ కుటిల బుద్ధిని చాటుకున్నారు. గంగూలీ కారుపై దాడి చేసి తమ అక్కసు వెళ్లగక్కారు.
ఇంగ్లండ్ పై పాకిస్థాన్ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. అదే రోజు పాక్ అభిమానులు అత్యుత్సాహంలో భారత్ మాజీ కెప్టెన్ - సౌరవ్ గంగూలీ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గంగూలీ తన కారులో ప్రయాణిస్తుండగా పాక్ అభిమానులు అడ్డుపడ్డారు. కారుపై ఎక్కి దాడి చేశారు. అంతటితో ఆగగకుండా పాకిస్థాన్ జిందాబాద్...హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాక్ జెండా పట్టుకుని దాదా కారు కదలకుండా నలువైపులా చుట్టుముట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో గంగూలీ సంవయవనం కోల్పోలేదు. కారు లోపలి నుంచి గంగూలీ చిరునవ్వు నవ్వి కొద్ది సేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈనెల 18న ఆదివారం భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఫైనల్ లో తలపడనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల పోరు మొదటిసారి కావడం విశేషం. 2007 ఐసీసీ 20-20 వరల్డ్ కప్ ఫైనల్లో పాక్‌ను ఓడించి ధోనీసేన కప్ గెలిచిన సంగతి తెలిసింది. అది మినహా మరే ఐసీసీ ఫైనల్లోనూ దాయాదులు తలపడే అవకాశం రాలేదు. ఈ నెల 15న జరిగిన చాంపియన్ ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ గెలిచి ఫైనల్ చేరింది. జూన్ 4న భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్ లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/