ప్రయోగంలోనే పేలిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్

Update: 2020-05-30 12:10 GMT
ప్రపంచంలోనే తొలిసారి ఓ ప్రైవేట్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ తొలి ప్రైవేటు అంతరిక్ష యానాన్ని చేపట్టింది. రాబోయేరోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబడులు విస్తరించేందుకు.. కొత్త అన్వేషణలు చేసేందుకు.. సామాన్యులు సైతం విమాన మెక్కినట్టు అంతరిక్షంలోకి వెళ్లగలిగేందుకు స్పేస్ ఎక్స్ కంకణం కట్టుకొని చేపట్టింది.

స్పేస్ ఎక్స్ సంస్థ వ్యవస్థాపకులు, బడా వ్యాపారి ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఈ తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రకు అంతా సిద్ధమైంది. ‘క్రూ డ్రాగన్’ అనే మానవ సహిత క్యాప్సూల్ ను బుధవారం రాత్రి ప్రయోగిస్తున్నారు. ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు.

తాజాగా స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ రాకెట్ ప్రయోగం ‘స్టార్ షిప్’ నమూనా పరీక్షిస్తుండగానే పేలిపోయింది. దక్షిణ టెక్సాస్ లోని ఎలన్మస్క్ స్సేస్ కంపెనీలో శుక్రవారం గ్రౌండ్ టెస్ట్ చేస్తుండగా రాకెట్ పేలిపోయింది. నాసా స్పేస్ లైట్ వెబ్ సైట్ దీన్ని లైవ్ లో ప్రసారం చేసింది. క్షణాల్లోనే రాకెట్ పేలిపోయి అగ్నిగోళంలా నిప్పులు కక్కింది. కొద్దిసేపట్లోనే కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా? లేదా అన్నది స్పేస్ ఎక్స్ కంపెనీ వెల్లడించలేదు.

తాజాగా ఘటన కారణంగా బుధవారం రాత్రి స్పేస్ ఎక్స్ -నాసా కలిసి చేపట్టిన ప్రయోగంపై ఎలాంటి ప్రభావం పడదని సంస్థ ప్రకటించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో మరో రాకెట్ వ్యవస్థ ద్వారా ప్రయోగం చేస్తామన్నారు.
Full View
Tags:    

Similar News