స్పెషన్ దేశం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది

Update: 2021-12-14 23:30 GMT
ఇటీవల కాలంలో మారుతున్న జీవన స్థితిగతులతో మనిషి మానసికంగా చాలా కుంగిపోతున్నాడు. భావోద్వేగాలను సరిగా బయటపెట్టుకోలేక ఒకరకమైన సైకోగా మారుతున్నాడు. పని ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఒక్కోసారి మనలో మనకు గట్టిగా ఏడవాలనిపిస్తుంటుంది. కానీ సరైన ప్రదేశం లేక మనసులోనే కుమిలిపోతుంటాం. ఆ బాధను కక్కలేక మింగలేక అణుచుకుంటాం. ఇతరులతో పంచుకునే బాధలైతే సన్నిహితుల దగ్గర షేర్ చేసుకుంటాం. కానీ ఇంకా కొన్ని వ్యక్తిగత విషయాలు, ఇంట్లోవారికి చెప్పలేని ఆర్థిక సమస్యలు గట్రా ఉంటే మనలో మనమే బాధపడుతాం. అయితే ఇలా బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతోందని స్పెయిన్ దేశం ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది.

మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో స్పెయిన్ దేశం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధానిలో మాడ్రిడ్ వో రెండు వినూత్న ప్రాజెక్టులను ప్రవేశపెట్టింది. అవే క్రైయింగ్ రూమ్స్, మానసిక ఆందళన గది. ఇవి చూసి కంగారుపడకండి. అనేక చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పెషన్ ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఎవరికైనా బాగా ఏడవాలని అనిపిస్తే చాలు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని ఆ దేశ ప్రభుత్వ ప్రకటించింది. మనసులో ఉన్న బాధ అంతా కూడా పోయేవరకు గట్టిగా ఏడవచ్చు. లోపల ఉన్న ఆందోళనను అంతా ఏడుపు రూపంలో తీసెయవచ్చు. సహజంగా ఏదైన సమస్య ఉన్నప్పుడు తలుచుకొని బాధపడే కన్నా... కాసేపు ఏడిస్తే ఆ ఆవేదన నుంచి రిలాక్స్ అవుతారు. కాబట్టి మనలో ఉన్న ఆ ఉద్వేగం పోయేంత వరకు ఏడవవచ్చు.

పని ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా వ్యక్తి మానసికంగా కుమిలిపోతున్నాడని స్పెయిన్ ప్రభుత్వం గమనించింది. అందుకోసమే పలువురు మానసిక వైద్యనిపుణులతో చర్చించింది. అనంతరం మానసిక ఆందోళన గదిని ఏర్పాటు చేసింది. ఎవరైనా మెంటల్ గా చాలా డిస్ట్రబ్ గా ఉంటే ఇక్కడికి వెళ్లవచ్చు. అక్కడ ఉండే వైద్యులను సంప్రదించి... మానసిక రుగ్మతల నుంచి బయటపడవచ్చు. మానసిక ఆందోళనకు గురువుతున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం సర్వే చేపట్టింది. అందులో దాదాపు 5.8శాతం మంది ఉన్నారని తేలింది. ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది.

ఈ క్రైయింగ్ రూమ్స్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయంపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మారిన జీవన పరిస్థితులు, పని ఒత్తిడి, మానసిక ఆందోళన నేపథ్యంలో ఇలాంటి సేవలు చాలా అవసరం అని అంటున్నారు. అంతేకాకుండా మీ ఏడుపు మీరు ఏడవండి అనే కొత్త కాన్సెప్టును తీసుకురావడం మంచి పరిణామం అని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News