ఒకప్పుడు మన దీనిగురించి అయినా మాట్లాడేటప్పుడు అప్పటి రోజుల్లో అలా , ఇప్పటి రోజుల్లో ఇలా అని మాట్లాడుతుంటాం. కానీ, ఇకపై కరోనా వైరస్ కి ముందు , కరోనా వైరస్ తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, కరోనా మహమ్మారి మానవ జీవితాలపై అంత పెద్ద ప్రభావాన్నే చూపిస్తుంది. మానవ జీవితంలో మాస్క్ , శానిటైజర్ భాగంగా మారిపోయాయి. ఒకప్పుడు లాక్ డౌన్ అంటే అర్థం ఏమిటో కూడా తెలియని వారు , ఇప్పుడు లాక్ డౌన్ వేయాలంటూ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరోనా వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. గతంలో కేవలం ఐటీ రంగానికి మాత్రమే తెలిసిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రస్తుతం అందరూ వాడుతున్నారు . తప్పనిసరిగా ఆఫీస్ కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు.
మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో ప్రస్తుతం ఇదే ఒరవడి కొనసాగుతుంది. అలాగే మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా వర్చువల్ విధానంలోనే చర్చిస్తున్నారు. ఈ నేసథ్యంలో త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాలను కూడా వర్చువల్ విధానంలోనే జరిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వివిధ రాష్ట్రాల నుంచి పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి రావడం అంటే చాలా కష్టం. అలాగే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే వందలాది మంది ఒకే చోట గుమిగూడతారు. సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తోన్న సమయంలో అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో వర్చువల్ విధానం ద్వారానే పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మనదేశం కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే , ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కరోనా నివారణ కి తీసుకున్న చర్యలపై కేంద్రం పై విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి మాటల దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వర్చువల్ విధానం అయితే , కేంద్రం కూడా కొంచెం గట్టెక్కినట్టే. అయితే , దీన్ని అస్త్రంగా తీసుకోని పార్లమెంట్ లో ఎన్డీయే సర్కార్ ను ఇబ్బంది పెట్టాలని ప్లాన్స్ వేస్తోన్న ప్రతిపక్షాలకు ఈ వర్చువల్ సమావేశలపై ఏ విదంగా స్పందిస్తారో.