తడి అన్నది లేకుండా సాగుతున్న నేతల ప్రసంగాల నేపథ్యంలో.. తాజాగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాజా వ్యాఖ్యలు మనసును హత్తుకునేలా ఉండటమే కాదు.. ఆయనపై మరింత గౌరవం పెంచేలా ఉండటం గమనార్హం. ఏపీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనపై ఏపీ విపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టటం.. అది కాస్తా వీగిపోవటం తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని చెప్పుకొచ్చారు.
తనపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. తనపై పలు ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావించటం.. విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం హార్ట్ టచింగ్ గా ఉండటమే కాదు.. కొన్ని మాటలు అలా గుర్తుండిపోయేలా ఉండటం గమనార్హం. ఆయన ప్రసంగాన్ని క్లుప్తంగా చెప్పుకొస్తే..
నాపై విశ్వాసం ఉంచిన సభకు ధన్యవాదాలు. ప్రతిపక్షం.. ప్రతిపక్ష నాయకుడు నాపై అవిశ్వాసం ప్రకటించటం కొస్తా బాధగా ఉంది. నేను ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నిక కావటానికి విపక్షం సహకరించింది. ఆ విషయంలో అప్పుడూ ఇప్పుడూ థ్యాంక్స్ చెబుతున్నా. నాపై అవిశ్వాసం ప్రతిపాదించిన సమయంలో చాలామంది విపక్ష నేతలు కలిశారు.. చర్చ ఎప్పుడు తీసుకుంటారని అడిగి.. నాలుగు రోజులు ఆగితే విత్ డ్రా చేసుకుంటామని చెప్పారు.
పక్షపాతి అన్న ముద్ర వేసిన తర్వాత ఎక్కువ టైం లేకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని.. లేకుంటే ఛైర్ లో పని చేయటం చాలా కష్టమని చెప్పా. విత్ డ్రా ఆలోచన.. ప్రతిపాదన చేయకముందే ఆలోచించాల్సిందని వారితో చెప్పా. ఒకసారి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన వచ్చిన తర్వాత.. విత్ డ్రా చేసుకోవటం మంచిది కాదని చెప్పా. మీ నాయకుడి మాటను పాటించండని చెప్పా. నా వల్ల తెలీక పొరపాట్లు జరిగి ఉంటే చెప్పలేను కానీ.. స్పీకర్ గా నా బాధ్యతను నిర్వర్తించా. ఈ పదవి నాకు అనుకోని అవకాశం. ఈ సందర్భంగా నా ట్రాక్ రికార్డు చెప్పాల్సిన అవసరం ఉంది.
నా జీవితం ఒడిదుడుకులతో ప్రారంభమైంది. మాదో మధ్యతరగతి కుటుంబం. ఉన్నత కుటుంబమే అయినా.. అన్నదమ్ముల ఆస్తి పంపకాలతో దిగువ మధ్యతరగతి కుటుంబంలా మిగిలిపోయాం. చాలా కష్టాలు చవిచూశాం. మా అమ్మా.. నాన్న పొలానికి వెళ్లి పని చేసేవారు. మా ఊరికి నీళ్లు.. రోడ్డు.. బడి.. కరెంటు.. బస్సు.. ఆసుపత్రి ఇవేమీ లేవు. అలాంటి గ్రామంలో పెరిగిన నేను.. గ్రామాల్ని బాగు చేయాలని అనుకునేవాడిని. ఒకసారి టైఫాయిడ్ వస్తే 30 లంఖణాలు (ఆహారం అనేది పెట్టకుండా పస్తులు ఉంచటం) ఉంచారు. కషాయం తాగించారు. అందుకే.. చిన్నప్పటి నుంచి డాక్టర్ని కావాలనుకునేవాడిని.
మా ఇంట్లో నేను పెద్దవాడ్ని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు.. ఇద్దరు చెల్లెళ్లు. ఆ రోజుల్లో స్మాల్ ఫ్యాక్స్ ఎక్కువగా ఉండేది. దాని వ్యాక్సిన్ వేయటానికి వస్తే.. జనాలు పొలాల్లోకి పరుగులు తీసేవారు. ఆ వ్యాక్సిన్లు వేయించుకుంటే జ్వరం.. ఒళ్లు నొప్పులు వస్తాయని అనుకునేవారు. అలా.. వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా వారం వ్యవధిలో నా ఇద్దరు తమ్ముళ్లను.. చెల్లెళ్లను పోగొట్టుకున్నా. ఇప్పటికి ఆ దృశ్యం నా కళ్ల ముందు కనిపిస్తోంది. ఒక్క వారంలో నలుగురు తోడబుట్టిన వారిని పోగొట్టుకోవటమే నన్ను డాక్టర్ ని అయ్యేలా చేసిందని తన గురించి చెప్పుకొచ్చారు. ఈ మాటలు పలువురిని తీవ్రంగా కదిలించాయి