వారెవ్వా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ.. విమాన ప్రయాణం ఎలా సాగిందంటే?
ప్రపంచంలోని వింతలు.. విశేషాలకు కేరాఫ్ గా గిన్నిస్ వరల్డ్ బుక్ నిలుస్తోంది. ఇందులో తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రతీఒక్కరూ తహతహ లాడుతుంటారు. ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఇందులో చోటు సంపాదించుకోలేరు. ఇక హైట్ పరంగానూ గిన్నిస్ బుక్ లో పలువురు చోటు సంపాదించుకొని తమ పేరిట సరికొత్త రికార్డులను నమోదు చేశారు.
ప్రపంచంలోనే అత్యంత తక్కువ హైట్ కలిగిన వారి పేర్లను.. అత్యంత పొడవు కలిగిన వారి పేర్లను గిన్నిస్ బుక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా టర్కీకి చెందిన రుమెయ్సా నిలిచారు. ఈ మహిళ ఎత్తు 215.16 సెంటి మీటర్లు కావడం విశేషం. 2014 లోనే రుమెయ్ గెల్గీ పేరిట అత్యంత పొడవైన టీనేజర్ గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
అలాగే అత్యంత పొడవైన వేళ్లు కలిగిన మహిళగానూ.. అత్యంత పొడవైపు వీపు కలిగిన మహిళగానూ గెల్గీ పేరిట రికార్డులున్నాయి. 2021 అక్టోబర్ నెలలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గెల్గీ గిన్నిస్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రస్తుతం ఈ మహిళ టర్కీ నుంచి కొత్త అవకాశాల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఆరునెలల పాటు ఉండనున్నారని సమాచారం.
ఇందులో భాగంగానే రుమెయ్సా గెల్గీ టర్కీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు విమాన ప్రయాణం చేశారు. దాదాపు 13 గంటలపాటు ఆమె జర్నీ సాగింది. గెల్గీ ప్రయాణం కోసం టర్కీ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు.
ఆరు సీట్లను కలిసి ఓ స్ట్రెచర్ లా తయారు చేసి నిద్రించేందుకు అనువుగా మార్చారు. ఈ ఏర్పాట్లపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది.అలాగే ఎయిర్ లైన్స్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ తన ఇన్ స్ట్రాలో ఒక పోస్ట్ చేసింది.
"నా మొదటి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది.. నాతో ప్రయాణించిన వారందరరికీ ధన్యవాదాలు.. ఇది నా తొలి విమాన ప్రయాణం.. ఇదే చివరిది కాకూడదని కోరుకుంటున్నా" అంటూ తన ఇన్ స్ట్రాలో గెల్గీ రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ పై టర్కీ ఎయిర్ లైన్స్ స్పందిస్తూ.. భవిష్యత్తులోనూ మీకు ఏ సాయం కావాలన్నా అందిస్తామని పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
ప్రపంచంలోనే అత్యంత తక్కువ హైట్ కలిగిన వారి పేర్లను.. అత్యంత పొడవు కలిగిన వారి పేర్లను గిన్నిస్ బుక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా టర్కీకి చెందిన రుమెయ్సా నిలిచారు. ఈ మహిళ ఎత్తు 215.16 సెంటి మీటర్లు కావడం విశేషం. 2014 లోనే రుమెయ్ గెల్గీ పేరిట అత్యంత పొడవైన టీనేజర్ గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
అలాగే అత్యంత పొడవైన వేళ్లు కలిగిన మహిళగానూ.. అత్యంత పొడవైపు వీపు కలిగిన మహిళగానూ గెల్గీ పేరిట రికార్డులున్నాయి. 2021 అక్టోబర్ నెలలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గెల్గీ గిన్నిస్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రస్తుతం ఈ మహిళ టర్కీ నుంచి కొత్త అవకాశాల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఆరునెలల పాటు ఉండనున్నారని సమాచారం.
ఇందులో భాగంగానే రుమెయ్సా గెల్గీ టర్కీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు విమాన ప్రయాణం చేశారు. దాదాపు 13 గంటలపాటు ఆమె జర్నీ సాగింది. గెల్గీ ప్రయాణం కోసం టర్కీ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు.
ఆరు సీట్లను కలిసి ఓ స్ట్రెచర్ లా తయారు చేసి నిద్రించేందుకు అనువుగా మార్చారు. ఈ ఏర్పాట్లపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది.అలాగే ఎయిర్ లైన్స్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ తన ఇన్ స్ట్రాలో ఒక పోస్ట్ చేసింది.
"నా మొదటి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది.. నాతో ప్రయాణించిన వారందరరికీ ధన్యవాదాలు.. ఇది నా తొలి విమాన ప్రయాణం.. ఇదే చివరిది కాకూడదని కోరుకుంటున్నా" అంటూ తన ఇన్ స్ట్రాలో గెల్గీ రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ పై టర్కీ ఎయిర్ లైన్స్ స్పందిస్తూ.. భవిష్యత్తులోనూ మీకు ఏ సాయం కావాలన్నా అందిస్తామని పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.