ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలలు. సరిగ్గా చెప్పాలంటే 65 రోజులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందటం అంటే..? ఆమె ఎంతటి అనారోగ్యానికి గురయ్యారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి కమ్ అమ్మను ఆసుపత్రికి చేరినట్లుగా బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పటికీ.. ఆమెది ఎంత అనారోగ్యమన్నది ఆసుపత్రిలో చేరిన నాలుగైదు రోజులకు కానీ అర్థం కాలేదు. అప్పటికి తేరుకున్న మీడియాలో అమ్మ అనారోగ్యంపై ఫోకస్ చేసింది. ఒక దశలో కొన్ని మీడియా సంస్థలైతే.. అమ్మకేదో అయిపోయిందన్న భావన కలిగేలా వార్తలు ఇచ్చేశాయి. దీనికి తోడు సోషల్ మీడియా పుణ్యమా అని.. అమ్మ అభిమానులైతే.. తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మొండిగా వ్యవహరించే అమ్మ.. చివరకు తనను పట్టి పీడిస్తున్న ‘అనారోగ్యాన్ని’ మొండితనంతో తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారనే చెప్పాలి. తీవ్ర అనారోగ్యం అన్న మాటేకానీ.. అసలు అమ్మకు ఏమైందన్న విషయాన్ని ప్రజలకు ఇప్పటికి స్పష్టంగా తెలీలేదు. కోట్లాది మందికి అరాధ్యనీయమైన వ్యక్తి ఆసుపత్రిలో ఉండిపోతే.. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు రాలేదు. సంచలన కథనాలు అందించే మీడియా సంస్థలు సైతం అమ్మ విషయంలో అసలు వాస్తవం ఏమిటన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే సాహసం చేయలేదనే చెప్పాలి.
ఆమె ఆరోగ్యం కుదుట పడింది.. ఎలాంటి సమస్యా లేదన్న విషయాన్ని తేల్చి చెప్పిన తర్వాత నుంచి జయలలితకు సంబంధించిన వార్తలకు మీడియా ఇచ్చే ప్రాధాన్యత బాగా తగ్గించేశారు. వారానికో.. పది రోజులకో ఆమె తాజా ఆరోగ్య పరిస్థితి గురించి నాలుగు ముక్కలు చెప్పి మమ అని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబితే.. వాటిని అంతేలా వార్తలు అందించే వైనం కనిపిస్తుంది. ఇలాంటి వేళ.. ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
సింగపూర్ నుంచి ఆమె కోసం ఒక రోబోను తెప్పించినట్లుగా చెబుతున్నారు. మైకు సాయంతో ఆమె మాట్లాడుతున్నారని.. 90 శాతం వరకు సహజరీతిలో శ్వాస తీసుకోగలుతున్నారని.. సొంతంగా నడవటమే తర్వాయి అన్నట్లుగా అపోలో ఆసుపత్రి ఛైర్మన్ మాటలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఆమెకు అవసరమైన ఫిజియోథెరపీ చేయటం కోసం సింగపూర్ నుంచి ఒక రోబోను తెప్పించినట్లుగా చెబుతున్నారు.
రోబోటిక్ ఫిజియోథెరపీకి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆసుపత్రికి గా మౌంట్ ఎలిజిబెత్ కు పేరుంది. ఈ ఆసుపత్రి నుంచి ఇద్దరు మహిళా ఫిజియోథెరపిస్టులను గతంలోనే తీసుకొచ్చారు. తాజాగా.. ఒక ప్రత్యేకమైన రోబోను తెప్పించారు. అపోలో ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. తాజాగా చేస్తున్న ఏర్పాట్లతో అమ్మ త్వరలోనే తనకు తానుగా నడిచేస్తారని చెబుతున్నారు. ఇంతకీ.. అమ్మకు వచ్చిన అనారోగ్యం ఏమిటి? ఆమెకు ఎలాంటి చికిత్స చేసినట్లు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/