బీజేపీ వాదన లేకపోతే కేంద్రమంత్రుల వాదన చాలా విచిత్రంగా ఉంటోంది. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్నది వాస్తవం. విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప ఉక్కుఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇలా ఏ విషయం తీసుకున్నా మోడీ ప్రభుత్వం ఏపీకి అన్యాయమే చేస్తోంది. చేస్తున్న అన్యాయాలు సరిపోవన్నట్లుగా తాజాగా విచిత్రమైన వాదన మొదలు పెట్టింది.
ఇంతకీ కొత్త వాదన లేకపోతే ఆరోపణ ఏమిటంటే ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీనట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి చౌధురి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీని తామెలా నెరవేరుస్తామని ఎదురు ప్రశ్నించారు. ఇంత కాలం ఏపీకి ప్రత్యేకహోదా అన్నది యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీగానే మాట్లాడుకుంటున్నారు. మొదటిసారిగా ప్రత్యేక హోదా అన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అని బయటపడింది.
నిజంగా కేంద్రమంత్రికి ఏపీ అంటే ఎంత చులకనగా ఉందో అర్ధమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అన్న హామీని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చారు. పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రకటన చేశారంటే అది పార్లమెంటు ఏపీకి ఇచ్చిన హామీ అనే అర్ధం. పార్లమెంట్ లో ప్రధానమంత్రి మాట్లాడే ప్రతి మాట కేంద్ర ప్రభుత్వం మాటగానే చూడాలి. ఇంతచిన్న విషయం కూడా ఆలోచించకుండా కేంద్రమంత్రి నోటికొచ్చింది మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా మళ్ళీ ఎదురు నోటికొచ్చింది మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.
ఎన్నికల హామీకి ప్రభుత్వం హామీకి కూడా కేంద్ర మంత్రికి తేడా తెలీదా ? ఎన్నికల హామీని కాంగ్రెస్ పార్టీ అయినా మరేపార్టీ అయినా పార్లమెంట్ లో ఇస్తుందా ? ఎన్నికల హామీలను పార్టీల అధినేతలు తమ పార్టీ ఆఫీసుల్లోనో లేకపోతే బహిరంగసభల్లోనో ఇచ్చుకుంటారు. అంతేకానీ పార్లమెంట్ లో ఇవ్వరు, ప్రకటించరు. ప్రత్యేక హోదా ఇవ్వని విషయాన్ని ఎలా సమర్ధించుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి అర్ధమవుతున్నట్లు లేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా జనాలు నిలదీస్తారనే భయం మొదలైనట్లుంది. అందుకనే ఏదోవిధంగా బయటపడేందుకు కొత్త బుకాయింపులు మొదలుపెట్టినట్లుంది కేంద్రం.