ఉత్కంఠ తీరింది. ఆరు రోజులుగా సాగిన హైడ్రామా ఒక కొలిక్కి వచ్చింది. తిరుగులేని అధికారాన్ని కర్ణాటక ప్రజలు చేతికి ఇచ్చినప్పటికి.. అదెవరి చేతిలో ఉండాలన్న దానిపై పడిన మల్లగుల్లాలు ఎట్టకేలకు ఒక రాజీ పార్ములాను ఫైనల్ చేశాయి. కర్ణాటక రాష్ట్రతదుపరి ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య అన్నది ఫైనల్ అయ్యింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య.. డిప్యూటీ సీఎంగా కర్ణాటక పీసీసీ రథసారధి డీకే శివకుమార్ అన్న ఒప్పందానికి ఇరువురు ముఖ్యనేతలు ఓకే చెప్పేయటం తెలిసిందే.
అధిష్ఠానం అండతో సిద్దరామయ్య ఈ నెల ఇరవైన (శనివారం) కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇలాంటి వేళ.. సిద్దరామయ్యకు మాత్రమే సాధ్యమైన నాలుగు విశేషాల్ని ఇక్కడ ప్రస్తావించాల్సిందే. కర్ణాటక రాజకీయాల్లో సిద్దరామయ్యకు మాత్రమే సాధ్యమైన వీటిని చూస్తే.. ఆయన ఎంత స్పెషల్ అన్న విషయం అర్థమవుతుంది. బలం పరిమితమైనా.. అధికారం అపరిమితం అన్నది సిద్ధరామయ్యకే సాధ్యమని చెప్పాలి. ఒంటి చేత్తో పార్టీని గెలిపించే సత్తా లేకున్నా.. సీఎం పదవిని చేపట్టే విషయంలో ఆయనకే ఓటు వేసే విచిత్రమైన.. విలక్షణమైన నేతగా నిలుస్తారు.
1. సిద్ధరామయ్య ప్రస్తుత వయసు75 ఏళ్లు. కర్ణాటకలో ఐదేళ్లు సంపూర్ణంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి.. మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఛాన్సు దక్కించుకున్న రెండో నేత ఆయనే. ఆయనకు ముందు దేవరాజ్ ఉర్స్ రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నికైన చరిత్ర ఉంది. 1972-80 వరకు ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నారు.
2. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవిలో ఉండి.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై.. మళ్లీ జరిగిన ఎన్నికల అనంతరం సీఎం కుర్చీలో కూర్చోనున్న తొలి వ్యక్తి సిద్దరామయ్యే. అధికారం ఉండగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆఖరి ముఖ్యమంత్రిగా రామక్రిష్ణ హెగ్డేగా రికార్డు ఉన్నప్పటికీ.. మధ్యంతరానికి వెళ్లాల్సి వచ్చింది.
3. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్దరామయ్య ఐదేళ్లు పూర్తి కాలం అధికారంలోకి కొనసాగితే కొత్త చరిత్ర ఆయన పేరు మీద నమోదవుతుంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగిన రాజకీయ నేతగా ఆయన రికార్డు క్రియేట్చేసినట్లు ఉంటుంది. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. బీజేపీ సీనియర్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు ప్రమాణస్వీకారం చేసినప్పటికి ఒక్కసారి కూడా ఆయన పూర్తి కాలం పాటు బాధ్యతల్ని నిర్వర్తించలేదు.
4. కాంగ్రెస్ కు ముందు సిద్దరామయ్య జనతాదళ్ లో ఉండేవారు. 2006లో ఆయన పార్టీ మారారు. ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఏకైక కాంగ్రెస్ వలసనాయకుడిగా ఆయనకు పేరుంది.