క్యాబిన్ లో పొగలు.. ప్రాణాలు పోతున్నాయని దేవుడికి మొక్కులు.. వణికిన ప్రయాణికులు
ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో అసలు గాలియే ఉండదు. ఇప్పటికీ విమానం ప్రయాణంలో ఆక్సిజన్ అందక చాలా మంది ఊపిరి బిగపట్టుకుంటారు. అంతటి క్లిష్ట వాతావరణంలో క్యాబిన్ లో పొగలు వస్తే ఇక గాలి ఆడక ప్రాణాలు పోవడం ఖాయం. అలాంటి పరిస్తితినే స్పైస్ జెట్ ప్రయాణికులు అనుభవించారు. ఇక ప్రాణాలు పోతున్నాయని బతుకుపై ఆశలు వదిలేసి దేవుడికి మొక్కుకున్నారు. మోడీ సహా అందిరికీ తమను కాపాడాలని ట్వీట్లు పెట్టారు.ఈ ఘటన తాజాగా స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది.
విమానం గాల్లో ఉండగానే క్యాబిన్ లోకి పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు వణికిపోయారు. చివరకు హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.
గోవా-హైదరాబాద్ ఎస్.జీ 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదానికి దారితీసింది. స్పైస్ జెట్ మాత్రం విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారని చావు కబురు చల్లగా చెప్పింది.
ఈ ఘటనలో పాలుపంచుకున్న ప్రయాణికులు మాత్రం బతుకుపై ఆశలు వదిలేసి భయంభయంగా గడిపారు. వారు తమ అనుభవాలను మీడియాతో పంచుకొని దేవుడికి చివరి మొక్కులు మొక్కామని తెలిపారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని స్పైస్ జెట్ పై మండిపడ్డారు.
దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్యకేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఊపిరి ఆడడం లేదన్న ఆమెను అనంతరం జూబ్లీహిల్స్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు.
హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఫ్రెండ్స్ తో కలిసి ఫస్ట్ టైం విమానం ట్రిప్ కు బయలుదేరారు.అకస్మాత్తుగా క్యాబిన్ లో పొగలు వ్యాపించడంతో దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధ కలిగించిందని వాపోయాడు. ప్రయాణికులందరూ దిగ్బ్రాంతికి గురయ్యారని.. చాలా మంది ప్రాణభయంతో కేకలు పెట్టారని ఆవేదన చెందారు.
వాష్ రూంలో ఏదో జరిగిందని.. 20 నిమిషాల్లో చుట్టూ పొగలు కమ్ముకున్నాయని తెలిపారు. లైట్లు వేసి మాట్లాడొద్దని చెప్పారని.. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక జంప్ అండ్ రన్ అంటూ అరిచారని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటన వీడియోలు ఫొటోలను తొలగించాలని ఎయిర్ లైన్ సిబ్బంది బలవంతం చేశారని వాపోయారు. ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారని శ్రీకాంత్ ఆవేదన చెందారు. మొత్తంగా స్పైస్ జెట్ వరుస ప్రమాదాలతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.