బెయిర్ స్టో వీర ఉతుకుడు.. పంజాబ్ చిత్తు..చిత్తు!

Update: 2020-10-09 03:45 GMT
సన్ రైజర్స్ మరోసారి మెరిసింది. బ్యాట్స్ మెన్, బౌలర్లు రప్పాడించారు. పంజాబ్ పై గ్రాండ్ సక్సెస్ సాధించింది. వార్నర్, బెయిర్ స్టో  ఆకాశమే హద్దుగా చెలరేగి గారు బౌండరీల మోత మోగించారు. రికార్డు స్థాయి భాగస్వామ్యం నమోదు చేశారు. పంజాబ్ బౌలర్లు ఏకంగా 15 ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోయారు. 160 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. బెయిర్ స్టో(97)  చాలా రోజుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రైజర్స్  ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (97: 55 బంతుల్లో 7x4, 5x6), డేవిడ్ వార్నర్ (52: 40 ఓపెనర్లు బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీలు బాదారు. ఓపెనర్లు రికార్డు స్థాయి భాగస్వామ్యం నమోదు చేసినా మిడిల్ ఆర్డర్ తడబాటుతో హైదరాబాద్ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది.  మనీశ్ పాండే (1), ప్రియమ్ గార్గె (0) తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో పరుగుల వేగం తగ్గింది. చివర్లో కేన్ విలియమ్సన్ (20: 10 బంతుల్లో 1x4, 1x6), అభిషేక్ శర్మ (12 నాటౌట్: 6 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడటంతో  రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

అనంతరం సన్‌రైజర్స్  స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/12) చెలరేగడంతో  పంజాబ్‌ 16.5 ఓవర్లలో132 పరుగులకే  ఆలౌట్ అయ్యింది. పంజాబ్ జట్టులో  నికోలస్ పూరన్ (77: 37 బంతుల్లో 5x4, 7x7) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే అతడికి ఇతర బ్యాట్స్ మెన్ సహకారం అందించలేకపోయారు. ఓ దశలో పూరన్ ఛేజ్ చేసి అద్భుతం సృష్టిస్తాడేమో అనిపించింది. ఎందుకంటే అతడి బ్యాటింగ్ అంత దూకుడుగా సాగింది.
ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ లో  రషీద్ ఖాన్ అతడిని ఔట్ చేసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. మ్యాచ్‌ ని పూర్తిగా పంజాబ్‌ కి దూరం చేసేశాడు. ఐపీఎల్లో రైజర్స్ కు ఇది మూడో విజయం కాగా.. పంజాబ్ ఐదోసారి ఓడింది. పంజాబ్ బ్యాట్స్ మెన్లు మయాంక్ అగర్వాల్ (9)  రాహుల్(11), సిమ్రాన్ సింగ్ (11), గ్లెన్ మాక్స్‌వెల్ (7), మనదీప్ సింగ్ (6) విఫలం అయ్యారు.

బెయిర్‌ స్టో అల్లాడించాడు

ఈ మ్యాచ్ లో బెయిర్‌స్టో ఆటే హైలెట్. అతడు  భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పంజాబ్ బౌలర్లను వణికించాడు. బెయిర్ స్టో ధాటికి  హైదరాబాద్‌ స్కోరు ఏ దశలోనూ ఓవర్‌కి 10కి తగ్గలేదు. వార్నర్- బెయిర్‌స్టో జోడీ తొలి వికెట్‌ కి 15 ఓవర్లలోనే 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

నికోలస్‌ 17 బంతులకే అర్ధసెంచరీ

లీగ్‌ లో సరికొత్త రికార్డు నమోదైంది. వెస్టిండీస్‌ హార్డ్‌ హిట్టర్‌, పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ 17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. అబ్దుల్‌ సమద్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ లో వరుసగా 6, 4, 6, 6, 6 బాదడం తో నికోలస్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ  సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదయింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో అర్ధశతకంగా నమోదైంది. టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ లోకేశ్‌ రాహుల్‌ 14 బంతుల్లో అర్థ శతకం సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.

వార్నర్ ఒకే జట్టుపై 9 అర్ధ శతకాలు  

సన్‌ రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కింగ్స్‌ పంజాబ్‌ తో మ్యాచ్ అంటే చాలు ఇక పరుగులే పరుగులు. ఈ మ్యాచ్ లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కింగ్స్‌ పంజాబ్‌ పై వార్నర్ కి ఇది వరుసగా తొమ్మిదో అర్ధ శతకం.  2015 నుంచి 2020 మధ్య కాలం లో పంజాబ్‌ పై ఆడిన ప్రతీ సారి వార్నర్‌ హాఫ్‌ సెంచరీ సాధిస్తూ వస్తున్నాడు.
Tags:    

Similar News