శ్రీకాకుళం టీడీపీకి నేత‌లు క‌రువు..!

Update: 2021-09-03 10:30 GMT
ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కీల‌క‌మైన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీ నేత‌లు క‌రువ‌య్యారా? ఇక్క‌డ పార్టీ త‌ర‌ఫున యాక్టివ్‌గా ఉండే నాయ‌కులు క‌నిపించ‌డం లేదా? అంటే.. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌క‌లు. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ ఒకే కుటుంబం టీడీపీ త‌ర‌ఫున పోటీచేయ‌డం.. గెలుపు లేదా ఓట‌మి.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పోనీ.. ఈ కుటుంబం నుంచి వార‌సుల‌కు రాజ‌కీయాలు ఆస‌క్తి లేక‌పోవ‌డం వంటి ప‌రిణామాల‌తో ఇక్క‌డి టీడీపీలో యువ నాయ‌క‌త్వం కొర‌త భారీగా క‌నిపిస్తోంది. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గుండ అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌ ఫ్యామిలీ కొన్నేళ్లుగా చ‌క్రం తిప్పుతోంది.

2004, 2009 ఎన్నిక‌ల్లో గుండ అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ ఓడిపోవ‌డంతో 2014లో గుండ స‌తీమ‌ణి.. ల‌క్ష్మీదేవి విజ‌యం ద‌క్కించుకున్నారు. వివాదర‌హితులుగా, అవినీతి ర‌హిత పాలిటిక్స్ చేసే నాయ‌కులుగా గుర్తింపు ఉన్న ఈ కుటుంబం నుంచి వార‌సులు రాజ‌కీయంగా ముందుకు వ‌చ్చేందుకు ఆస‌క్తితో లేరు. అయిన‌ప్ప టికీ.. చంద్ర‌బాబు వీరికే టికెట్ కేటాయిస్తున్నారు. కానీ, ఇప్పుడు ల‌క్ష్మీదేవి కూడా వ‌యో భారంతో మునుప టి మాదిరిగా పార్టీలో కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాలేక పోతున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో యాక్టివ్‌గా క‌నిపించినా.. త‌ర్వాత‌.. చాలా రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని భావిస్తే.. ఇక‌, అప్ప‌టికి ఈ కుటుంబం పూర్తిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప‌రిస్థితి లేకుండా పోతుంది.

మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కుడు, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సైలెంట్‌గా ఉంటూ నే నియోజ‌క‌వ‌ర్గంలో చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు.. టీడీపీ శ్రేణుల‌ను కూడా ఆకర్షించే ప‌నిలో ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ యాక్టివ్‌గా ఉండే నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పార్టీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు.. చంద్ర‌బాబు కూడా కురువృద్ధుల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని తాజాగా నిర్ణ‌యించుకోవ‌డంతో గుండ కుటుంబానికి ఈ సారి టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మేనని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. ఇక్క‌డ యువ‌త‌కు ప్రాధాన్యం లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా గుండ కుటుంబం మంచిదే అయినా.. కేవ‌లం ఈ కుటుంబాన్నే న‌మ్ముకుని చంద్ర‌బాబు పార్టీని ఇరుకున ప‌డేలా చేశారా ? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌ట‌కి అయినా చంద్ర‌బాబు ఇక్క‌డ మ‌రో నేత‌ను రెడీ చేసుకుంటేనే ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన‌కు పోటీ ఉంటుంద‌ని అంటున్నారు.






Tags:    

Similar News