తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న కీలక విధానాన్ని మార్చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం.. అన్య మతస్తులు ఎవరైనా సరే.. స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే.. తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అందులో స్వామి వారిని నమ్ముతున్నట్లుగా ఉండేది. తాజాగా అలాంటి డిక్లరేషన్ ఏమీ అవసరం లేకుండానే అన్య మతస్తులు ఎవరైనా సరే స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో.. ఇంతకాలం అన్య మతస్తులు ఎవరైనా సరే స్వామి వారి దర్శనానికి ఉన్న పరిమితులు తొలిగిపోయినట్లుగా చెప్పాలి. మరి.. దీనిపై హిందూ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇదిలా ఉంటే.. చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరగనున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 23న సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వామి వారి గరుడ సేవలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల్ని సమర్పిస్తారని చెబుతున్నారు.