‘‘బోడి చదువులు వేస్టు... ఆడి చూడు క్రికెట్టు..’’ అన్న పాట గుర్తుండే ఉంటుంది. చాలాకాలం కిందట వచ్చిన ఓ తెలుగు సినిమాలోని ఈ పాట అప్పట్లో సూపర్ హిట్టు. కుర్రకారు ఆ పాటతో బాగా కనెక్టయిపోయారు. తల్లిదండ్రులు మాత్రం పాట రచయితను తెగ తిట్టుకున్నారు. కానీ... వాస్తవంగా క్రికెటర్లను చూస్తే ఆ మాట నిజమే అని అంగీకరిస్తారు ఎవరైనా. ఎందుకంటే హై స్కూలు చదువు కూడా లేకున్నా హై రేంజి లైఫ్ గడుపుతున్నారు ఇప్పటి క్రికెటర్లు.
బ్రహ్మాండమైన లైఫ్ అనుభవిస్తున్న ఇండియన్ క్రికెటర్లలో ఎక్కువమంది పెద్దగా చదువూ సంథ్యా లేనివారే. అయినా, కోట్లాది మందికి వాళ్లు ఆదర్శం. వారిని అభిమానించే, ఆరాధించే, పూజించేవారు కోట్లాది మంది ఉన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ వారంటే ఇష్టమే. ఇంత క్రేజ్ ఉన్నా వారికున్న చదువు అంతంతమాత్రమే. టాలెంటు ఉంటే చాలు చదువు అవసరం లేదని నిరూపిస్తున్నారు వారు. ఈ సందర్భంగా మన క్రికెటర్ల చదువుసంథ్యలేంటో చూద్దామా?
విరాట్ కోహ్లి.... చిన్నవయసులోనే క్రికెట్ లోకి అడుగుపెట్టి ఇప్పుడు అదరగొడుతున్న విరాట్ కోహ్లీ కేవలం ఇంటర్ వరకే చదివాడు.
ధోనీ... కెప్టెన్ గా, కీపర్ గా, హిట్టర్ గా, మ్యాచ్ విన్నర్ గా, స్టైలిష్ యంగ్ మ్యాన్ గా అన్నివర్గాల ప్రజల మనసు దోచుకున్న ధోనీ కూడా ఇంటరే చదివాడు. ఇప్పుడు ఆయన బీకామ్ చదువుతున్నాడట.
గంగూలీ... ఇండియా టీంకు దూకుడు నేర్పిన ఈ బెంగాల్ టైగర్ చదివింది కేవలం బీకామ్ మాత్రమే.
సురేశ్ రైనా... వన్డేలు - టెస్టులు - టీ20లు అన్న తేడా లేకుండా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా కాలేజి మెట్లు కూడా ఎక్కలేదట. ఆయన చదువు హైస్కూలులోనే ఆగిపోయింది.
సచిన్ టెండూల్కర్... ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మన్ గా రికార్డులు రారాజుగా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ కూడా ఇంటర్ తోనే చదువు ఆపేశాడు. ఆ తరువాత ఆయనకు క్రికెట్టే ప్రపంచమైపోయింది. చదువు పక్కకుపోయింది.
వీవీఎస్ లక్ష్మణ్... వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ గా పేరున్న ఈ స్టైలిష్ క్రికెటర్ ఆటలో ఎంత పెర్ఫెక్టో... చదువులోనూ అంతే పెర్ఫెక్టో. అడ్డదిడ్డంగా ఆడకుండా పక్కాగా క్రికెట్ పుస్తకాల్లో ఉన్నట్లు కళాత్మకంగా, సైద్ధాంతికంగా క్రికెట్ ఆడే ఈ సొగసరి బ్యాట్స్ మన్ చదువులోనూ అంతే పక్కా విద్యార్థి. ఎంబీబీఎస్ మధ్యలో ఆపేసి పూర్తిగా క్రికెటర్ గామారిపోయాడు కానీ లేకుండా మంచి డాక్టరయ్యుండేవాడు లక్మణ్.
రోహిత్ శర్మ.... వన్డే క్రికెట్ లోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో రెండు డబుల్ సెంచరీలు కొట్టేసిన ఈ కుర్రాడు చదివింది ఇంటర్మీడియట్.
శిఖర్ ధావన్.... మనోడు మిగతా క్రికెటర్ల కంటే మరీ ముదురు. హైస్కూలుతో చదువుకు పుల్ స్టాప్ పెట్టేసి బ్యాటు పట్టేశాడు.
రాహుల్ ద్రావిడ్.... ప్యూర్టీ టెక్నికల్ బ్యాట్స్ మన్ గా పేరు తెచ్చుకున్న ద్రవిడ్ డిగ్రీ తరువాత ఎంబీఏలో చేరాడు కానీ మధ్యలోనే ఆపేశాడు.
యువరాజ్... ఒక్క ఓవర్లోనే ఆరుసిక్సర్లను ఉతికి ఆరేసిన యువరాజ్ ఇంటర్మీడియట్ తోనే సరిపెట్టేశాడు.
కుంబ్లే... మాస్టర్ మైండ్ ఉన్న క్రికెటర్ గా పేరున్న కుంబ్లే చదువులోనూ ది బెస్టే. ఆయన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.
జహీర్ ఖాన్.. ఇంజినీరింగ్ మధ్యలో మానేసి ఫుల్ టైం క్రికెటర్ గా మారిన జహీర్ కొన్నేళ్ల పాటు ఇండియాకు ప్రధాన బౌలర్ గా వ్యవహరించాడు.
ఇంకా శ్రీశాంత్ ఇంజినీరింగ్, సెహ్వాగ్ డిగ్రీ, గంభీర్ డిగ్రీ, అశ్విన్ ఇంజినీరింగ్, ఉమేశ్ యాదవ్ హైస్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు.