దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత ఇటీవలే దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా క్వారంటైన్ నిబంధనలు ఉండడంతో పలువురు ఇప్పుడప్పుడే ప్రయాణాలు పెట్టుకోవడం లేదు.
దీంతో కేంద్రం తాజాగా పలు సడలింపులు ఇచ్చింది. విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు క్వారంటైన్ లేదని తెలిపింది. అయితే కొన్ని షరతులు విధించింది. రాష్ట్రాల వారీగా క్వారంటైన్ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
*ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిషా, త్రిపుర, రాజస్థాన్, మిజోరం, ఝార్ఖండ్, గుజరాత్ , అండమాన్ తదితర రాష్ట్రాల్లో 14 రోజుల హోం క్వారంటైన్ అమలు చేస్తున్నారు.
*ఆంధ్రప్రదేశ్ లో ముందుగా స్పందన అనే వెబ్ సైట్ లో అనుమతి తీసుకొని రాష్ట్రానికి రావాలి.ఏపీకి చెన్నై, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వస్తే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.
*తెలంగాణతోపాటు బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విమానంలో వచ్చిన వారికి ఎలాంటి క్వారంటైన్ లేదు.
*కర్ణాటకలోకి ఎంట్రీకి సేవాసిందు వెబ్ సైట్ లో ఈపాస్ తీసుకోవాలి.
*జమ్మూకశ్మీర్ లో దిగే వారికి కరోనా పరీక్ష, 14 రోజుల క్వారంటైన్.
*గోవాకు వెళ్లాలనుకుంటే కరోనా పరీక్ష సర్టిఫికెట్ చూపించాలి. లేదంటే 2వేలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి.
*కేరళ: ఈపాస్ తప్పనిసరి. వారంలో తిరిగే వెళ్లే వారికి ఎలాంటి క్వారంటైన్ లేదు. మిగతా వారికి 14 రోజులు హోంక్వారంటైన్.
*తమిళనాడు: ఈపాస్ తప్పనిసరి. 14 రోజులు క్వారంటైన్ లోఉండాలి.
*పశ్చిమ బెంగాల్: ఆన్ లైన్ లో హెల్త్ డిక్లరేషన్ తీసుకురావాలి.