దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పాటై ఇంకా పదేళ్లు కూడా పూర్తి చేసుకోక ముందే తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ నిలిచింది. ఈ విషయాన్ని తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్సో - ఆ పార్టీ నేతలో చెప్పిన మాట ఎంతమాత్రం కాదు. దేశ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన కితాబు ఇది. ఆర్బీఐ కితాబిచ్చిందంటే... తెలంగాణ నిజంగానే దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడలేనని ఒప్పుకోక తప్పదు కదా. స్టార్టప్ లను ఆకర్షించే విషయంలో తెలంగాణ సర్కారు సాధించిన ప్రగతిని కీర్తిస్తూ ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేసిందట.
అయినా ఏ విషయంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందన్న విషయానికి వస్తే... సూక్ష్మ - మధ్య తరహా పరిశ్రమల రంగంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందట. ఈ విషయాన్ని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంకు నియమించిన ఓ కమిటీ అన్ని రాష్ట్రాలను పరిశీలించి మరీ నిగ్గు తేల్చింది. దేశంలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు - ప్రత్యేకించి స్టార్టప్ లను ఆకర్సించే పథకాలపై ఈ కమిటీ అధ్యయనం చేసిందట. అధ్యయనం ముగిసిన మీదట సదరు కమిటీ సవివర నివేదికను రిజర్వ్ బ్యాంకుకు అందించిందట. సదరు నివేదికలోనే తెలంగాణ పట్ల సదరు కమిటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు - ప్రత్యేకించి స్టార్టప్ లు ఏర్పాటయ్యేందుకు తెలంగాణలో మంచి అవకాశాలున్నాయట. ఈ విషయంలో తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు తగినంతగా శ్రద్ధ పెట్టలేదట. దీంతో తెలంగాణ మినహా దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం వైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కన్నెత్తి కూడా చూడటం లేదట. అదే తెలంగాణ విషయానికి వస్తే... స్టార్టప్ లు ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకెు పెద్ద ఎత్తున రాయితీలు, ఇతరత్రా అనుమతుల విషయంలో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం మెరుగ్గా ఉందట. దీంతోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తెలంగాణకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారట. ఈ నేపథ్యంలో స్టార్టప్ లను ఆకర్షించే విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణను మార్గదర్శకంగా తీసుకోవాలని ఆర్బీఐ సూచించిందట. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.