కడుపులోని విత్తనం చెట్టెలా అయ్యిందబ్బా!

Update: 2018-09-27 04:23 GMT
కడుపులోని విత్తనం చెట్టవడమేమిటి? వినడానికే వింతగా ఉందా. అవును ఇది నిజమే. ఇస్తాంబుల్ లో ఎప్పుడో 44 ఏళ్ల కిందట జరిగింది. ఆ మనిషి తిన్నది అంజీరా. ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వింతగా మారింది.  అసలు విషయమేమిటంటే..

1974లో గ్రీక్ సిప్రియోట్స్ - టర్కిష్ సిప్రియోట్స్ మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి అహ్మత్ హెర్గూన్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. 2011లో ఓ పరిశోధకుడు అసాధారణ కొండ ప్రాంతంలో అంజీర చెట్టు పెరగడాన్ని గుర్తించాడు. ఆ ప్రాంతాన్ని తవ్వుతుండగా మనిషి మృతదేహం చూసి ఆశ్చర్యపోయాడు. అతని కడుపులో నుంచే చెట్టు పెరగడాన్ని గమనించాడు.

87 ఏళ్ల హెర్గూన్ సోదరి మునూర్  అప్పటి విషయాలను చెప్పుకొస్తూ మేము ఓ చిన్న గ్రామంలో ఉండేవాళ్లం. అందులో సగం టర్కిష్ లు కాగా - మిగతా సగం మంది గ్రీకులు. 1974లో ఘర్షణలు మొదలయ్యాయి. నా సోదరుడు అహ్మత్ టర్కిష్ రెసిస్టెన్స్ ఆర్గనైజేషన్ లో చేరాడు. ఆ ఏడాది గ్రీకులు అతడిని తీసుకెళ్లిపోయారు అని వివరించింది.

ఆందోళనలు జరుగుతున్నప్పుడు హెర్గూన్ టర్కిష్ రెసిస్టెన్స్ ఆర్గనైజేషన్ లో ఉన్నాడు. గుహలో ఉండగా ఇతడిని, మరో ఇద్దరిని డైనమేట్ ద్వారా చంపినట్లు విచారణ నిర్వహించిన అధికారులు నిర్ధారణకు వచ్చారు. 40 ఏళ్లుగా వాళ్ల మృతదేహాలను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. చనిపోయే ముందే హెర్గూన్ అంజీర పండ్లు తిన్నట్లు అంచనాకు వచ్చారు. అది అసలు జరిగిన విషయం. ఇది ఆ నోటా ఈ నోటా చేరి అరుదైన చెట్టుగా రికార్డుకెక్కింది.

Similar News