కరోనా వైరస్ జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా మహమ్మారి వల్ల మొత్తం ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ దేశం ఈ దేశం అని కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశం కూడా కరోనా కాటుకి బలై వణికిపోయింది. ఈ కరోనా మహమ్మారి బెడద ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది , మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో .. బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కొరోనా వైరస్ స్ట్రెయిన్ మరింత ఆందోళనకి గురిచేస్తుంది.
ఈ కొత్త కరోనా స్ట్రెయిన్ మిగిలిన దేశాల్లో కొంచెం తక్కువగా వ్యాపిస్తున్నా కూడా , బ్రిటన్ లో మాత్రం చాలా వేగంగా విస్తరిస్తుంది. స్ట్రెయిన్ పోసిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతుంది. పాత వైరస్ తో పాటుగా బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం లాక్ డౌన్ ను విధించారు.
ఫిబ్రవరి నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటె,బ్రిటన్ లో కరోనా కేసుల వివరాలపై ఓ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దేశంలో ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. అలానే, లండన్ లో ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు సర్వేలో నిర్ధారణ జరిగింది. వైరస్ బారిన పడినప్పటికీ లక్షణాలు లేని వ్యక్తులను గురించే క్రమంలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ స్ట్రెయిన్ వైరస్ కారణంగానే .. బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.