ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. సాంకేతికంగా ఎంత అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పటికీ.. తరాల తరబడి సాగే కొన్ని ఆచారాల్ని అదే పనిగా ఆచరించే ధోరణి చాలా దేశాల్లోని ప్రజలమధ్య చూస్తుంటాం. అలాంటి ఒక పండుగ గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా? ఇలా కూడా చేస్తారా? అన్న సందేహానికి గురవుతారు. కానీ.. ఇలాంటి పండుగను జపనీయులు చేసుకుంటారు. ఈ పండుగను కరోనా పుణ్యమా అని తాత్కాలికంగా ఆపేశారు. తాజాగా ఈ పండుగను జపాన్ మొత్తంలో ప్రజలు వేడుకలా చేసుకున్నారు. ఇంతకీ ఆ పండుగ ఏమిటో తెలుసా? తమ పసిపిల్లల్ని విపరీతంగా ఏడిపించేసి.. పండుగచేసుకుంటారు. ఇదెక్కడి శాడిజం అనుకోవద్దు. ఎందుకంటే ఇలా ఏడిపించటంలోనూ జపనీయుల లెక్కలు వారికి ఉన్నాయి మరి.
పసిపిల్లల్లో ఎవరు ఎంత ఎక్కువగా ఏడిస్తే వారు గెలిచినట్లే కాదు.. వారు ఆరోగ్యంగా ఉన్నట్లుగా అంచనా వేసే విచిత్రమైన అలవాటు జపనీయుల్లో ఉంది. ఇదెక్కడి సంప్రదాయమని మీకు అనిపించొచ్చు కానీ.. జపనీయులు మాత్రం ఈ తరహా పండుగను చాలా ఇష్టంగా జరుపుకుంటుంటారు. తాజాగా జపాన్ వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పండుగ వేళ తమ చిన్నారులకు సుమో ఆప్రాన్స్ వేసి.. ఇద్దరు పిల్లల్ని ఒకేసారి సుమో రింగులోకి తీసుకెళ్లి.. అక్కడే ఉన్న ఇద్దరు సుమోల చేతికి చెరో పిల్లను ఇస్తారు.
ఆ చిన్నారుల్ని భద్రంగా పట్టుకునే సుమోలో.. వారికి ఎత్తి పట్టి ఇద్దరు ఢీ కొన్నట్లుగా పోటీ పడతారు.. ఈ క్రమంలో ఎవరైతే భయపడి ముందుగా ఏడుస్తారో.. వారు గెలిచినట్లుగా నిర్ణయిస్తారు. అదే సమయంలో.. వారి ఏడుపు ఆధారంగా వారి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు. కొన్నిచోట్ల ఎవరు ముందుగా ఏడుస్తారో వారు ఓడినట్లుగా నిర్ణయిస్తుంటారు. కొందరుపిల్లలు ఇట్టే ఏడ్చేస్తే.. మరికొందరు పిల్లలు ఎంత ప్రయత్నించినా ఏడుపు అన్నది రానట్లు ఉండిపోతారు. పిల్లల్నిభయపెట్టేందుకు వీలుగా డెమన్ మాస్కులు ధరిస్తుంటారు.
పిల్లల ఏడుపు శబ్దాన్ని ఆధారంగా చేసుకొని.. వారి ఆరోగ్యాన్ని తాము అంచనా వేస్తామని జపనీయులు చెబుతుంటారు. ఈ తరహా ప్రోగ్రాంను నిర్వహించిన అసకుసా టూరిజం ఫెడరేషన్ ఛైర్మన్ తాము అనుసరించే ఈ పండుగ గురించి మాట్లాడుతూ.. పిల్లల్ని ఏడిపించటాన్ని కొందరు దారుణమైన చర్యగా చూస్తారని. కానీ పిల్లలు ఎవరు గట్టిగా ఏడుస్తారో.. వారు ఆరోగ్యంగా ఎదుగుతారన్నది తమ నమ్మకంగా చెప్పారు. ఈ క్రైయింగ్ సుమో ఫెస్టివల్ కు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాంటి పద్దతులు ఉంటాయని.. కొన్నిచోట్ల మొదట ఏడ్చిన పసిపిల్లాడ్నివిజేతగా నిలిపితే.. మరికొన్నిచోట్ల అస్సలు ఏడవని పసిపిల్లల్ని విజేతలుగా నిర్ణయిస్తుంటారు. ఏమైనా.. భలే సిత్రంగా ఉంది కదా ఈ పండుగ.