కరోనా భయంతో ఏడాదిన్నరగా ఇంట్లోనే...తూ. గో. జిల్లాలో విచిత్ర ఘటన !

Update: 2021-07-19 14:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచం యొక్క జీవన విధానంలో కీలకమైన మార్పులు తీసుకువచ్చింది. వచ్చే రోజుల్లో ఏం మాట్లాడినా కూడా కరోనా వైరస్ కి ముందు , కరోనా వైరస్ కి తర్వాత అని చెప్పాల్సింది. ప్రజలు తమ తమ ఇంట్లో నుండి బయటకి రావడానికి కూడా జంకుతున్నారు. ఓ పెళ్లి వేడుకకి వెళ్లాలన్నా కూడా కరోనా భయమే , ఓ చావు కి వెళ్లాలన్నా కూడా కరోనా భయమే. కనీసం పక్క ఇంట్లో ఉండేవారితో కూడా కరోనా దెబ్బకి మాట్లాడకలేకపోతున్నారు.  అయితే, కరోనా ఎఫెక్ట్‌కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో విచిత్ర ఘటన వెలుగు చూసింది.

కరోనా వైరస్ మహమ్మారి  సోకుతుందనే భయంతో ఓ కుటుంబ సభ్యులు, రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత గత ఏడాదిన్నర కాలంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. కరోనా భయంతో ఒకే గదిలో ఏడాదిన్నర నుంచి జీవనం సాగిస్తున్నారు. అయితే, మరీ చిత్రంగా కాలకృత్యాలు, నిద్రాహారాలు అన్నీ అదే ఒకే గదిలో కానిచ్చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా , వారికి ఏదైనా అవసరం అయితే  తండ్రి, కుమారుడు మాత్రమే అప్పుడపుడు బయటకు వస్తుంటారు.

అయితే, ఇంటి స్థలం విషయంలో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయించేందుకు అధికారులు వారికి ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. స్థలం విషయమై వేరిఫికేషన్ కోసం వచ్చిన వాలంటీర్‌కు.. ఆ కుటుంబ సభ్యులు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇంట్లోనే ఉండి తమకు స్థలం వద్దని, తాము బయటకు రామని తెగేసి చెప్పారు. వారు అలా అనడానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.

ఈ విషయంపై గ్రామ సర్పంచ్  అధికారులకు సమాచారం అందించారు. రాజోలు ఎస్ఐ కృష్ణమాచార్య ఆధ్వర్యంలో వారిని ఇంటికి బయటకు వచ్చేలా చేశారు. అయితే ఏడాన్నరకాలంగా ఒకే గదిలో కాలకృత్యాలు, నిద్రాహారాలు చేయడంతో ఇంట్లో ఉంటున్న ముగ్గురు మహిళ కి  సరైన పోషకాహారం లేక ఆ ముగ్గురు మహిళలు అనారోగ్యంతోపాటు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
Tags:    

Similar News