ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రగులుకుంటోంది. అధికార - ప్రతిపక్షాల మధ్య పోటి నువ్వా నేనా అన్న స్థాయిలో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థను నీరుగార్చారనే విమర్శలున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో విద్యార్దులు... నిరుద్యోగులకు మంచిరోజులు వచ్చినట్లేనని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆ మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో మాత్రం జరిగింది శూన్యమని విద్యార్థులు - నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు నాయుడి వల్ల ఈ నాలుగేళ్లలో కలిగిన ప్రయోజనం శూన్యం అనే భావన వారిలో రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో హామీలతో విద్యార్దులను - యువతను ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయడి హయాంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని అంకెల గారడితో చంద్రబాబు ప్రజలను ఏమారుస్తున్నారని దుయ్యబడుతున్నారు. జగన్ మోహన రెడ్డి పాదయాత్రకి వస్తున్న వారిలో ఎక్కువ మంది విద్యార్దులు - యువతీ యవకులు కావడమే గమనార్హం.
దివంగత వైఎస్. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అగ్రకుల పేదలతో పాటు అందరు విద్యార్థులకు ఉన్నత విద్య ఉచితంగా అందేలా చేశారు. యువతీయవకులకూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని - ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు విద్యార్దులు - యువకులు ఎంతో లాభ పడ్డారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన తనయుడు వై.ఎస్.జగన్ మోహన రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి అలాంటి పాలన వస్తుందని విద్యార్దులు - యువకులు ఆశిస్తున్నారు. దీంతో వారందరి మద్దతు వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వై.ఎస్. జగన్ మోహన రెడ్డిని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పలు విద్యా సంఘాల నాయకులు కలుసుకుంటున్నారు. వీరిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్ది విభాగం ఎన్ ఎస్ యఐ, సీపీఎం కు చెందిన ఎస్ ఎఫ్ ఐ - సీపీఐకు చెందిన ఎఐఎస్ ఎఫ్ ఐ విద్యార్దులు ఉండడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు విద్యార్ది విభాగం నాయకులలో కొందరూ కూడా జగన్ ను రహస్యంగా కలిసినట్లు చెబుతున్నారు. విద్యార్దుల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వస్తున్న వ్యతిరేకత కారణంగా తెలుగు విద్యార్ది నాయకులు కూడా జగన్ ను కలుస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా తెలియడంతో ఆయన విద్యార్ది నాయకులను పిలిచి మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు నాగార్జున విశ్వవిద్యాలయం - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం - పద్మావతి విశ్వవిద్యాలయాలకు చెందిన పలు విద్యార్థి సంఘాల నాయకులు ఏకమై జగన్ కు మద్దతు ఇచ్చే విషయమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.