తమ రాష్ర్టానికి చెందిన సమస్యలపై రాజకీయ పార్టీల కంటే వేగంగా ప్రజల పక్షాన స్పందించే తమిళనాడు యువత మరో అంశాన్ని తమ ఎజెండాలో చేర్చుకుంది. గత ఏడాది జల్లికట్టుపై నిషేధం విదించిన సుప్రీంకోర్టు తీర్పును సైతం వ్యతిరేకిస్తూ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇప్పించుకునేందుకు అన్ని వర్గాలను యువత ఏకం చేసిన సంగతి తెలిసిందే. ఈ పోరాటం మెరీనా బీచ్ వేదికగా సాగింది. ఇపుడు అదే రీతిలో అదే మెరీనా బీచ్ వేదికగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ దఫా అంశం హైడ్రో కార్బన్ వ్యతిరేక పోరాటం.
తమిళనాడు రాష్ట్రంలో హైడ్రోకార్బన్ ప్రాజెక్టు ఏర్పాటుపై ఎప్పట్నుంచో వ్యతిరేకత ఉంది. అయితే ప్రభుత్వం మొండిగా ముందుకు పోతుండటంతో విద్యార్థులు నిరసన బాట పట్టారు. మెరీనా బీచ్ వద్ద హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా విద్యార్ధులు జలదీక్ష చేపట్టారు. ఈ ప్రాజెక్టును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్లు మొదలుపెట్టారు. లేదంటే తమ దీక్షను కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో మెరీనా బీచ్ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఘటనాస్ధలానికి పోలీసలు బలగాలు భారీగా చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/