జగన్ మామయ్య కి జై కొడుతున్న విద్యార్థులు !

Update: 2020-01-11 09:36 GMT
అమ్మఒడి ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేస్తున్న పథకాలలో ఒకటి. ప్రజాసంకల్ప పాదయాత్ర లో భాగంగా ..సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయలని విద్యార్థుల తల్లుల అకౌంట్స్ లోకి జమ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో మిగులు బడ్జెట్ లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోలేని తపనతో అర్హులైన అందరికి ఈ అమ్మఒడి పథకం కింద 15 వేల రూపాయలని సాయంగా అందించారు. ఈ అమ్మఒడి ప్రారంభ సభ లో జగన్ మాట్లాడుతూ ..చదువుకునే ప్రతి విద్యార్థికి నేను మేనమామ గా మారి చదువు కి కావాల్సిన డబ్బుని సమకూర్చుతానని చెప్పారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులందరూ జై జగన్ అంటూ సీఎం జగన్ కి థాంక్స్ చెప్తున్నారు. రాష్ట్రానికి జగన్‌ మామయ్య సీఎం కావడం తమ పాలిట వరంగా భావిస్తున్నామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. రాణిగారి తోటలో శనివారం సీఎం జగన్‌ మాస్క్‌లు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్‌ మామయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో వైఎస్సార్‌సీపీ నేతలు దేవినేని అవినాష్‌, బొప్పన భవకుమార్‌ పాల్గొన్నారు. దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. అమ్మ ఒడి అమలుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేద పిల్లలకు మేనమామలా అండగా నిలిచారని అన్నారు. అమ్మ ఒడితో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయని అన్నారు. పిల్లల సంక్షేమం విషయంలో కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రయోజనం లేదని, రాష్ట్ర జనం సంక్షేమ సారధి వైఎస్‌ జగన్‌ వైపే ఉన్నారని తెలిపారు.
Tags:    

Similar News