ఏపీకి కొత్త శక్తి.. జగన్ సలహాదారుడిగా కీలక వ్యక్తి

Update: 2020-03-02 10:00 GMT
విభజనతో ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రం.. లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక పాఠాలు, నిర్ణయాలు, సలాహాలు, సూచలను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ కు కొత్త వ్యక్తి వచ్చారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పని చేసిన విశేష అనుభవం ఉన్న కేంద్ర మాజీ అధికారిని ప్రస్తుతం జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కోలుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఆ సీనియర్ అధికారి సలహాలు, సూచనలు తీసుకునేందుకు జగన్ ఆయనను రాజస్తాన్ నుంచి మరీ ఏరికోరి పిలిపించుకున్నారు. తన పక్కన సీటును ఆయన కోసం కేటాయించారు. ఈ సందర్భంగా అతడికి రెండేళ్ల పదవికాలంతో పాటు కేబినేట్ హోదా కల్పించడంతో ఆయనెవరోనని అందరూ చర్చించుకుంటున్నారు. ఆయనే ఐఏఎస్ మాజీ అధికారి సుభాశ్ చంద్ర గార్గ్. రాజస్థాన్ కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ఆయనను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సలహాదారుగా సుభాశ్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల సమీకరణ వ్యవహారాలు, ఆర్థిక విధానాల కోసం గార్గ్ ను నియమించారు. ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. సుభాశ్ చంద్ర గార్గ్ కు ఆర్థిక విధానాల్లో అపార అనుభవం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పని చేశారు. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా కూడా విధులు నిర్వహించారు. ప్రఖ్యాత ఆర్థిక సంస్థల్లన్నింటిల్లో ఆయన పని చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయించిన వారిలో సుభావ్ చంద్ర కీలక పాత్ర పోషించారు.సార్వభౌమ బాండ్లను విక్రయించడం ద్వారా 10 బిలియన్ డాలర్లను సేకరించొచ్చని బడ్జెట్ లో ప్రతిపాదనను సూచించిన వ్యక్తి సుభాశ్ చంద్రనే. ఆర్థిక సంస్కరణలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

- 2000లో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
- 2008లో రాజస్థాన్ ఆర్థిక శాఖ కార్యదర్శి
- 2019లో జులైలో కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
- ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా పని చేశారు

సీఎం జగన్ కు ఇప్పటికే అనేక మంది సలహాదారుల్లో సుభాశ్ చంద్ర చేరిపోయారు. రాష్ట్రానికి సంబంధించిన సలహాలు, సూచలను ఇచ్చేందుకు వివిధ శాఖలకు, వివిధ రంగాలకు సలహాదారులుగా నియమించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి మెరుగుపర్చుకోవడంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సుభాశ్ చంద్ర సహాయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అవకాశం ఉంది. అందుకే ఆయనను ఏరికోరి తీసుకొచ్చారు.


Tags:    

Similar News