జీతం ఇవ్వలేదని ఎంపీడీవో ఎదుటే ఆత్మహత్య యత్నం

Update: 2020-05-14 09:50 GMT
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఈ మహమ్మారి కట్టడి కోసం ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రోజురోజుకి మహమ్మారి కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇక ప్రభుత్వం మాత్రం దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసే రాష్ట్రం ఏపీనే ..అందుకే పాజిటివ్ కేసులు బయటపడుతూన్నాయని ..త్వరలోనే కరోనా నుండి రాష్ట్రం  బయటపడుతుంది అని చెప్తున్నారు. అయితే , ఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల అనేకమంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి  కష్ట  కాలంలో కూడా జీతం ఇవ్వలేదంటూ పంచాయతీ కార్యాలయం లో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు.

ఈ ఘటన పై పూర్తి  వివరాలు చూస్తే ... ప్రకాశం జిల్లా కొండేపి కి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యాలయం లో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.  అయితే గత  ఆరు నెలలుగా జీతం రావడంలేదు. పై అధికారులని అడగ్గా వస్తుందిలే అని చెప్తూ వస్తున్నారు. ఈ తరుణంలోనే లాక్ డౌన్ కూడా రావడంతో ..మొత్తంగా ఆరు నెలల జీతం రాకపోవడంతో వస్తుందో , రాదో అని తీవ్రమనస్తాపం చెందిన ఆ  యువకుడు కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది చేతిలోని పెట్రోల్ బాటిల్ లాక్కుని బయటకు పంపించారు.
Tags:    

Similar News