ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఊరికే చంద్రబాబు అండ్ కోను బెదరగొట్టడానికి అంటున్నారో లేక నిజంగా ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయో తెలియదు కానీ.. కేసీఆర్ మాటలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. ఇంకా చాలా కథ ఉందని.. తెలిసింది గోరంత.. బయటపడబోయేది కొండంత అన్నట్లు మాట్లాడుతున్నారు కేసీఆర్. ఇంకా చాలా రికార్డింగులు, సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు కేసీఆర్. మరోవైపు ఏసీబీ కూడా ఇంకా చాలామంది పేర్లతో అడిషనల్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి కూడా రెడీ అవుతోంది.
ఈ కేసులో తెదేపాకు చెందిన ఓ కేంద్ర మంత్రి కూడా ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. కేంద్రంలో ఉన్న తెదేపా మంత్రులు ఇద్దరు. ఒకరు సుజనా చౌదరి, ఇంకొకరు అశోక్ గజపతి రాజు. ముందునుంచి రాజుగారు ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్లరు. చంద్రబాబు కూడా ఆయన్ని పురమాయించి ఉంటారని అనుకోలేం. ఇలాంటి కార్యాలు చక్కబెట్టడంలో సుజనా దిట్ట అని పేరు కూడా ఉంది. కాబట్టి రేవంత్ కేసు వ్యవహారంలో సుజనా చౌదరి ప్రమేయం గురించి సందేహాలు తలెత్తుతున్నాయి. డబ్బులు సమకూర్చడంలో ఆయన పాత్ర ఉండి ఉండొచ్చని అంటున్నారు. చంద్రబాబుకు సుజనా కుడి భుజం లాంటి వారని అందరికీ తెలిసిన విషయమే. అందుకే కేసీఆర్ ఆయన్ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లో సుజనా పేరు బయటికి రావచ్చని.. ఆయన ప్రమేయాన్ని బయటపెట్టొచ్చని సమాచారం.