బీజేపీలో చేరాక సుజనా షాకింగ్ కామెంట్

Update: 2019-06-21 04:58 GMT
ఇన్నాళ్లు ఒకమాట.. చంద్రబాబు, ఆయన పార్టీ ఆదేశాల మేరకు ‘ప్రత్యేక హోదా’ కోసం నినదించాల్సిందే.. కానీ ఇప్పుడు బీజేపీలో చేరగానే లోపలిలోంచి తన్నుకొస్తోంది. నిజాలు బయటపడుతున్నాయి. బీజేపీ పద్ధతులు అలవర్చుకోవాలి కదా.. అందుకే ఆ పార్టీలో చేరగానే టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ప్లేట్ ఫిరాయించాడు.

టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి గురువారం తోటి ముగ్గురు ఎంపీలతో సహా బీజేపీలో చేరిపోయారు. కమళ కండువా వేసుకోగానే ఆయన నోటి నుంచి నిజాలు జాలువారాయి. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాను ప్రత్యేక హోదాపై పోరాడనని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఎన్డీఏ నుంచి బయటకు రావద్దని తాను చంద్రబాబుకు ఎంతో చెప్పానని..కానీ ఆయన చెప్పినా వినకుండా వైదొలిగారని సుజనా చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. తాను ఎలాంటి కేసులకు భయపడి బీజేపీలో చేరలేదని.. వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి చేరలేదని స్పష్టం చేశారు. ఫోర్జరీ, చీటింగ్, మోసం లాంటి ఎలాంటి కేసులు లేవని.. థర్డ్ పార్టీ కేసులో సీబీఐ, ఈడీ తనను ప్రశ్నించాయని తెలిపారు.

ఇక తనపై వచ్చిన మీటూ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం తనను అనర్హుడిగా ప్రకటిస్తుందని.. దాన్ని స్వాగతిస్తానని   పేర్కొన్నారు.  బీజేపీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని.. టీడీపీని వీడడం బాధగా ఉందని పేర్కొన్నారు.  ఇలా సుజనా చౌదరి పార్టీ మారగానే బీజేపీలో అలా ట్యూన్ అయిపోయి ఇన్నాళ్లు ఉన్న టీడీపీని.. బాబును విమర్శించడం గమనార్హం..

    

Tags:    

Similar News