ఏపీ బీజేపీలో ఇపుడు కొన్ని గొంతుకల సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి. గతంలో ఒకరిద్దరు మాత్రమే కమలనాధులు సాఫ్ట్ వాయిస్ తో మాట్లాడేవారు. ఇపుడు మాత్రం ఏపీలోని నలుగురు ఎంపీలు నలుచెరగులా మాట్లాడుతున్నారు. దాదాపుగా ప్రతీ రోజూ వారి ప్రకటనలు ఉంటున్నాయి. అవి కూడా వాడిగా వేడిగా వైసీపీ సర్కార్ మీద ఉండడం విశేషం. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి రెండేళ్ల క్రితం వచ్చిన ముగ్గురు ఎంపీలలో ఒకరైన సుజనా చౌదరి దూకుడు బాగానే ఉందిపుడు.
ఆయన వరసబెట్టి ఏపీలో జిల్లాల టూర్లు కూడా చేస్తున్నారు. పలు జిల్లాల బీజేపీ నేతలు కూడా సుజనను ఇన్వైట్ చేయడం విశేషం. రెండు సార్లు రాజ్యసభ మెంబర్ గా ఉంటూ ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాకు జనంలో నేరుగా సంబంధాలు లేకపోవచ్చు కానీ అంగబలం అర్ధం బలం పుష్కలంగా కలిగిన నేత. ఆ మధ్యన సోము వీర్రాజు ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక కొన్నాళ్ళు సైలెంట్ అయిన సుజనా చౌదరి ఇపుడు మళ్లీ గేర్ మార్చారు.
ఈ మధ్యన తిరుపతి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారని టాక్. యాక్టివ్ కావాలని కోరినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దాంతో సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ, టీజీ వెంకటేష్ కానీ నాటి నుంచి తగ్గేది లే అంటున్నారు.
ఏపీలో అన్ని సమస్యల మీద వీరు గట్టిగానే స్పందిస్తున్నారు. కేంద్రం అంటే మేమే అన్నట్లుగా రీసెంట్ గా సీఎం రమెష్ వైసీపీ సర్కార్ మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వేడి అలాగే ఉండగానే సుజనా చౌదరి విశాఖలో మాట్లాడుతూ జగన్ సర్కార్ పాలన దారుణమని అనేశారు. ముప్పయేళ్ల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని కూడా చెప్పుకొచ్చారు.
ఈ ప్రభుత్వం మీద బీజేపీ పోరాటం చేస్తుందని, రానున్న ముప్పయి నెలలలో బీజేపీ తన సత్తాను ఏపీలో చాటుతుంది అంటూ సుజన చేసిన హాట్ కామెంట్స్ బీజేపీలో కదనోత్సాహాన్నే రగిలిస్తున్నాయి. జగన్ పాలన మీద సమరశంఖం పూరిస్తామంటూ ఆయన చెబుతున్న మాటలు కూడా బీజేపీలో చురుకు పుట్టిస్తున్నాయి. ఇక జగన్ సర్కార్ని లక్ష్యంగా చేసుకుని ఈ నెల 28న విజయవాడ నడిబొడ్డున బీజేపీ నిర్వహించే సభతో కమలం కసి ఏంటో చూపిస్తామని కూడా అంటున్నారు. మొత్తానికి సుజనోత్సాహం చాన్నాళ్ల తరువాత ఏపీ బీజేపీలో కనిపిస్తోంది.
ఒక వైపు సోము వీర్రాజు సరిసమానంగా అటు టీడీపీని, ఇటు వైసీపీని విమర్శిస్తూంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారు మాత్రం వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. ఇలా పాత కొత్త తరం నాయకుల మధ్య తేడా అయితే కచ్చితంగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ కోసం అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పనిచేయాలన్నది కేంద్ర పెద్దల ఆదేశం. మరి దాన్ని ఎవరికి వారు తమకు అనువుగా మార్చుకుంటున్నారు అన్న మాట ఉంది. ఏది ఏమైనా విజయవాడ సభకు అన్ని హంగులూ రంగులూ అద్దే పనిలో కొత్త బీజేపీ కామందులు ఉన్నారని టాక్. ఈ సభ కనుక సక్సెస్ అయితే బీజేపీలో సుజనా బ్యాచ్ దూకుడు మామూలుగా ఉండదంతే అంటున్నారు.