అంతర్జాతీయంగా సంచలనంగా మారిన ఇరాన్ కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీ అంత్యక్రియలు ఇరాన్ రాజధానిలో జరగటం తెలిసిందే. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావటమే కాదు.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని శపధాలు చేశారు. అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులన్ని కిక్కిరిపిసోయాయి. ఆధునిక ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖమోనీ అంత్యక్రియల తర్వాత ఇరానీయులు ఇంత భారీగా రోడ్ల మీదకు రావటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. తన తండ్రి ని డ్రోన్ల సాయం తో చంపించింది ట్రంపేనన్న విషయం మీద అవగాహనకు వచ్చిన సులేమానీ కుమార్తె జీనాబ్ సులేమానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని చంపినంత మాత్రాన అంతా అయిపో లేదని స్పష్టం చేశారు. తన తండ్రి బలిదానం తో అంతా అయి పోయిందని ట్రంప్ భావిస్తే అది పిచ్చితనంగా అభివర్ణించిన ఆమె.. ‘‘మా నాన్నని చంపిన అమెరికాకు చీకటి రోజులు దాపురించాయి’’ అని గర్జించారు.
ఇదిలా ఉంటే తమ దేశ జాతీయ వీరుడ్ని హత మార్చిన అమెరికా పట్ల అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని ఇరానీయులు మండిపడుతున్నారు. అంత్యక్రియల సందర్భంగా వేలాది ఇరానీయులు తమ చీఫ్ మరణానికి బదులు తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉంటే.. తమ మీద దాడికి పాల్పడిన పక్షం లో ఇరాన్ లోని చారిత్రక ప్రదేశాల్ని తాము గుర్తించామని.. వాటిని ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించటం గమనార్హం. తెగించినోడు ట్రంప్ మాటల్ని లెక్క చేస్తారా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.