కర్ణాటకలోని దివంగత రెబల్ స్టార్ అంబరీష్ ప్రాతినిధ్యం వహించిన మాండ్యా లోక్ సభ సీటు నుంచి ఆయన భార్య , ప్రముఖ నటి సుమలత బరిలోకి దిగింది. తాజాగా సుమలత బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. మాండ్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
సుమలత నామినేషన్ సందర్భంగా అంబరీష్ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె వెంట భారీ ర్యాలీ తీశారు. వేల సంఖ్యలో అంబరీష్ అభిమానులు సుమలత వెంట మద్దతుగా రావడంతో కోలాహలం నెలకొంది. అంబరీష్ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి.
సుమలత నామినేషన్ వేయడానికి ముందు తన ఇష్టదైవమైన చాముండేశ్వర దేవీని దర్వించుకొని పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత సచ్చిదానంద ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ కోసం బయలు దేరారు. అనంతరం ఆమె మాండ్యా కలెక్టర్ కు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
సుమలతకు మద్దతుగా 10 మంది అహిందా నాయకులు సంతకాలు చేశారు. హీరో యష్, సుమలత కుమారుడు అభిషేక్, ప్రముఖ నిర్మాత, నటుడు రాక్ లైన్ వెంకటేష్, నటుడు దొడ్డన్న, అంబరీష్ సోదరుడు మధుసూదన్, ప్రముఖ కన్నడ నటుడు నాగశేఖర్ తోపాటు చాలా మంది సినీ , రాజకీయ ప్రముఖులు సుమలత వెంట ఉన్నారు. అనంతరం మాండ్యాలోని జూబ్లీ పార్క్ లో ఏర్పాటు చేసిన సభలో సుమలత మాట్లాడారు.
*బీజేపీ ఇష్టం లేదు.. సుమలతకే మద్దతు: ప్రకాష్ రాజ్
సుమలత మాండ్య కోడలు అని.. అంబరీష్ ను కలకాలం కనిపెట్టుకొని ఉందని.. ఆమెకే మాండ్యా టికెట్ ఇవ్వడం కరెక్ట్ అని.. ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. సుమలత నామినేషన్ సందర్భంగా తన సంపూర్ణ మద్దతును ఆమెకు తెలియజేస్తున్నట్టు తెలిపారు. తనకు బీజేపీ అంటే ఇష్టంలేదని.. స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న సుమలత గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
బెంగళూరు సెంట్రల్ నుంచి ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఇప్పటికే అక్కడ ప్రచారం ప్రారంభించారు. సుమలతకు టికెట్ ఇవ్వకుండా సీఎం కుమారస్వామి కొడుకు హీరో నిఖిల్ కు ఇచ్చారని.. అతడు ఇంకా రాజకీయాల్లోకి వచ్చే వయసులు లేదని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. సుమలత గెలిస్తే ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు. రాజకీయ కుటుంబంలో ఉన్నానని.. ఆధిపత్యంతో పోటీచేస్తే నిఖిల్ గెలవడని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. నిఖిల్ కావాలా.? సుమలత కావాలా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.