మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణిగా దేశవ్యాప్తంగా సుపరిచితురాలైన సునంద పుష్కర్ అనుమానాస్పద రీతిలో మరణించటం తెలిసిందే. గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని విలాసవంతమైన లీలా హోటల్ లో ఆమె అనుమానాస్పద రీతిలో మరణించటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మృతి మీద పలు సందేహాలు వ్యక్తమైనా దాన్ని ఆత్మహత్యగానే చెబుతూ వచ్చారు. అయితే.. ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కొన్ని రోజులకు ఎయిమ్స్ వైధ్యులు సీన్ లోకి రావటం.. సునంద పుష్కర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఒత్తిళ్లు వచ్చినట్లుగా వెల్లడించటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ బీ ఐ రిపోర్ట్ తయారైంది. ఇప్పటివరకూ సునందపై పొలోనియం అనే విష పదార్థమే ఆమె మరణానికి కారణంగా భావిస్తున్నారు. అయితే.. తాజా నివేదిక మాత్రం సునంద మరణానికి పొలోనియం కారణం కాదని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఆమె మరణానికి విష పదార్థం కారణంగా చెప్పినా.. దానికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు.
ఐబీ నివేదిక మీద ఢిల్లీ పోలీసులు నోరు విప్పని నేపథ్యంలో.. పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సునంద అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఇప్పటికే ఆమె భర్త శశిథరూర్ కు.. మరికొందరికి పాలిగ్రాఫీ పరీక్షలు నిర్వహించారు. అయితే..వీటి వివరాలు బయటపెట్టలేదు. కాకుంటే.. మరికొద్ది రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన కొన్ని నిజాలు బయటకు వస్తాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బాసీ ఒక మీడియా సంస్థతో చెప్పిన నేపథ్యంలో.. మరి ఆ ‘‘నిజాలు’’ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.