తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్ ఛైర్‌పర్సన్ గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. ఈ కమీషన్ ఐదేళ్ల పాటు పదవిలో ఉండబోతుంది. సభ్యులుగా షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీ భాయ్ ,కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మీ, కటారి రేవతీ రావు నియమితులయ్యారు.
సునీతా లక్ష్మారెడ్డి వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004,2009వ సంవత్సరాల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేశారు.
2009లో సీపీఐకి చెందిన చిలుముల కృష్ణారెడ్డిపై 13,274 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే 2014 సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నిక, ఆ తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె గతేదాది టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ హయాంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఈ పదవి వరించడం గమనార్హం. అయితే, 2014లో జరిగిన మెదక్ ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి సునీత లక్ష్మారెడ్డి ఓటమిపాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.