ఏపీ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యేలపై ఈ మధ్యన ఆరోపణలు.. విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. చేతిలో ఉన్న అధికారంతో వారు చెలరేగిపోతున్నట్లుగా పలువురు వాపోతున్నారు. కొందరైతే నేరుగా మీడియా వద్దకే వచ్చేసి.. తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెడుతున్నారు.
తాజాగా అలాంటి ఆరోపణల్నే ఎదుర్కొంటున్నారు కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. వల్లభనేని కారణంగా తనకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాల గురించి తాను మాట్లాడటాన్ని వంశీ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె చెబుతున్నారు.
వంశీ అవినీతి గుట్టు విప్పుతున్న కారణంగా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. వంశీ అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు గూండాల్ని తనపై ఉసిగొల్పుతున్నారని.. బెదిరింపు ఫోన్ కాల్స్ చేయిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే వంశీపై ఫిర్యాదు చేసిన ఆమె.. పార్టీ పెద్దలకు తన పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు. ఏపీ డీజీపీ సాంబశివరావుకు.. విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న ఆమె.. వంశీకి భారీ సవాలే విసిరారు. వంశీకి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/