ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్ కి కారణాలు ఏంటి?

Update: 2021-05-20 08:30 GMT
ఈనెల 26న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆ రోజు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం వల్లే ఓ అపురూప దృశ్యం దర్శనమిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్ గా మారనున్నాడు. దానికి కారణం ఏంటి అంటే... సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖపైకి వస్తాయి. ఫలితంగా చంద్రుడు ఈ బ్లడ్ మూన్ గా కనిపిస్తాడు.

ఈ మూడు ఒకే రేఖపై వచ్చిన సమయంలో సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది. సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. కేవలం భూమి నీడ మాత్రమే చంద్రుడిని చేరుతుంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల కాంతి తరంగాలు చంద్రుని దిశగా ప్రయాణిస్తాయి. కాంతి తరంగాలు ఫిల్టర్ అయి చంద్రుడు ఎరపు, నారింజ, గోధుమ రంగుల్లో దర్శమిస్తాడు.

ఈ అద్భుత దృశ్యం భారతదేశానికి ఈశాన్య దిశలో ఆవిష్కృతం కానుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ నెల 26న సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమవుతుంది. 6.22గంటలకు ముగుస్తుంది. 14 నిమిషాల 30 సెకన్ల పాటు సంపూర్ణ గ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా అరుదుగా సంభివిస్తుందని అంటున్నారు.

కోలకత్తాలో పదేళ్ల క్రితం అనగా 2011 డిసెంబర్ 10న ఇలాంటి అపురూప దృశ్యం దర్శనమిచ్చిందని ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త దేబీ ప్రసాద్ దౌరీ తెలిపారు. ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహా సముద్రం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాల్లో పూర్తిగా కనిపిస్తుందని వెల్లడించారు. భారత్ లో పాక్షికంగానే కనిపించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.   
Tags:    

Similar News