నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణకు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాయలతో అంత్యక్రియలు నిర్వహించారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర మొదలవగా మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఘట్టమనేని అభిమానులు చివరిసారి తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలివచ్చారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు కృష్ణ. నిన్న మొత్తం నానక్ రామ్ గూడ తన నివాసంలో ప్రముఖుల సందర్శనార్ధం ఉంచగా బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్ లో అభిమానుల చివరి చూపు కోసం ఏర్పాట్లు చేశారు. 2 గంటల నుంచి అంతిమయాత్ర మొదలు పెట్టారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి అభిమానుల జన సంద్రంలో కృష్ణ గారి అంతిమయాత్ర జరిగింది.
తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే కృష్ణ గారి అంత్యక్రియలు జరిగాయి.
తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తొలి సినిమా నుంచి సాహసమే తన ఊపిరి అనేలా సినిమాలు సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగు తెరకు సరికొత్త సాంకేతిక పరిచయం చేశారు కృష్ణ.
స్టార్ హీరోగానే కాదు మంచి మనిషిగా కూడా కృష్ణ నిర్మాతలకు అండదండలు అందించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆ మంచి మనిషికి వీడ్కోలు పలికారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.