జ్యోతిష్యం ప్రకారం.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: సుప్రీంకోర్టు కామెంట్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? రావా? అనేది రాజకీయపరమైన విషయం. దీనిపై ఇక్కడి అధికార, ప్రతిపక్షాల మధ్య ఎప్పుడూ సందేహాలు ఉండనే ఉన్నాయి. అయితే.. ముందస్తు లేదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం కేసీఆర్ ఇటీవల స్పష్టం చేశారు. అయినప్పటికీ రాజకీయ నేతలు మాత్రం ఆయన మాటలను విశ్వసించడం లేదు. ఎందుకంటే అన్నింటికీ జాతకాలు, జ్యోతిష్యాలు చూసుకునే కేసీఆర్ తనకు అనుకూల సమయం చూసుకునిఎన్నికలకు వెళ్లిపోతారనేచర్చ నడుస్తూనే ఉంది.
ఇదిలావుంటే,సీఎం కేసీఆర్ కు ఉన్న జాతకాల పిచ్చి సుప్రీంకోర్టుకు కూడా చేరింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారం నడుస్తాయని, ముందస్తు వచ్చినా రావొచ్చని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
సుప్రీంకోర్టులో మంగళవారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనర్హత వేటు పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారం వస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలంటూ టీఆర్ ఎస్ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇది 2018 ఎన్నికల నాటి పిటిషన్ అని, మరికొన్ని వివరాల సమర్పణకు 3 వారాల సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్.. "తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018లో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి.
అలాగే ఈ కేసు విచారణకూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావాలి కావచ్చు" అంటూ వ్యాఖ్యానించారు. అదేసమయంలో జ్యోతిషం ప్రకారం ముందస్తు వచ్చినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.