విమానయానం కాస్తంత ఖరీదైనదే. ఇటు ప్రయాణికులతో పాటు అటు విమానయాన సంస్థలకూ ఇది వర్తిస్తుంది. ఫ్లైటెక్కాంటే ప్యాసింజర్ ఇతర రవాణా మార్గాల కంటే కాస్తంత ఎక్కువే చెల్లించక తప్పదు. అంతేకాకుండా ఇతర ప్రయాణ సాధనాల మాదిరిగా ఖాళీ సీట్లతో ఫ్లైట్ ను టేకాఫ్ చేయడం విమానయాన సంస్థలకు భారీ నష్టమే. ఇదే సూత్రాన్ని పాటిస్తామన్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వైఖరిపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో పాటు విమానయాన వ్యవహారాలను పర్యవేక్షించే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను కడిగిపారేసింది. ఈ కడిగిపారేయడం ఎంతగానంటే... అసలు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే స్పృహలో ఉన్నారా? అంటూ చీవాట్లు పెట్టినంతగా. సుప్రీం చీవాట్లతో కేంద్రం - డీజీసీఏ తరఫున వాదనలు వినిపించేందుకు కోర్టుకు వెళ్లిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారట.
ఇక ఈ వివాదం పూర్తి వివరాల్లోకెళితే..కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు వందే భారత్ పేరిట కేంద్రం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం ఎయిర్ ఇండియా విమానాలనే వినియోగిస్తున్నారు. ప్రజా రవాణాలో భౌతిక దూరం పాటించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు - రైల్వే శాఖ చర్యలు చేపడుతున్నా.. వందే భారత్ లో మాత్రం ఈ తరహా జాగ్రత్తలు కనిపించలేదు. విమానంలో ఒక వరుసలో మూడు సీట్లుంటే... మూడు సీట్ల లోనూ ప్రయాణీకులను కూర్చోబెడుతున్నారు. అంటే.. ఎయిరిండియా విమానాల్లో భౌతిక దూరం అన్న మాటే లేదన్న మాట. దీనిపై ఓ వ్యక్తి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... ఫ్లైట్ లో మధ్య సీటును ఖాళీగానే ఉంచేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డీజీసీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
డీజీసీఏ పిటిషన్ పై సోమవారం సుప్రీం సీజే జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సెంటర్ సీటును వదిలేయడం పెద్దగా ప్రయోజనమేమీ లేదని తుషార్ మెహతా తనదైన శైలి వాదనను మొదలెట్టారు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం... అసలు మీరు ప్రజల ఆరోగ్యం గురించి చింతిస్తున్నారా? లేక విమానయాన సంస్థల లాభాల గురించి చింతిస్తున్నారా? అంటూ ఓ రేంజిలో ఫైర్ అయ్యింది. ఎయిరిండియా విమానాల్లో మధ్య సీటును అలా వదిలేయాల్సిందేనని, సెంటర్ సీట్లను బుకింగ్ చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని, ఈ విధానాన్ని మరో రెండు నెలల పాటు అమలు చేయాల్సిందేనని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భ్ంగా కేంద్రం, డీజీసీఏ వైఖరిని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విమానాల్లో సామాజిక దూరం అవసరం లేదని కేంద్రం భావిస్తోందా? మార్గదర్శకాల్ో మాత్రం 6 అడుగుల దూరం పాటించాలని చెబుతున్నారు. దానిని విమానాల్లో ఎందుకు పాటించరు? భుజానికి భుజం తాకేలా సీట్లలో కూర్చోవడం ప్రమాదకరమని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమేనని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. బహిరంగ ప్రదేశాల్లో 6 అడుగుల దూరం పాటించాలని చెబుతున్న మీరే... విమానాల్లో ఒక సీటును వదిలేయలేరా? అంటూ నిలదీసింది. మొత్తంగా అటు కేంద్రం - ఇటు డీజీసీఏ వైఖరిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తుషార్ మెహతా ఏం చెప్పాలో తెలియక నానా పాట్లు పడ్డారట.