కావేరీ నదీ జలాల విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నాళ్లుగానో ఈ జలాల కోసం రెండు రాష్ర్టాలు కొట్టుకుంటున్నాయి. గతేడాది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది. అత్యున్నత న్యాయస్థానం కర్ణాటకను కరుణించింది. తమిళనాడుకు ఇవ్వాల్సిన వాటాను తగ్గించింది. దీంతో కర్ణాటకకు 14.75 టీఎంల నీరు అధికంగా వాడుకునే అవకాశం దక్కింది. తమిళనాడుకు 177 టీఎంసీలు ఇవ్వాలని కర్నాటకకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించి 2007లో 192 టీఎంసీలు తమిళనాడు వాటాగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కావేరీ నదీ జలాల పంపిణీపై తమిళనాడు - కేరళ - పుదుచ్చేరి - కర్నాటక ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తాజాగా తమిళనాడు వాటాను 177 టీఎంసీలకు తగ్గిస్తూ నేడు తీర్పును వెలువరించింది. తమిళనాడుకు వాటా తగ్గింపుతో కర్నాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు రానుంది.
కాగా, కేవలం బెంగళూరు నగరాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీం ఈ కీలక తీర్పు చెప్పింది. గతంలో ఎన్నడూలేని విధంగా బెంగళూరు నగరం నీటి కోసం అల్లాడుతోంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో నీరు అడుగంటిపోతున్న 11 నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు వాళ్లకు ఊరట కలిగించేదే. అదనంగా వస్తున్న నీటిలో కేవలం బెంగళూరు నగరం కోసం 4.75 టీఎంసీల నీటిని వాడుకోవాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది.
బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపాలో - సౌతాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లు ఇప్పటికే తాగునీరు కూడా దొరక్క బిక్కుబిక్కుమంటున్న విషయం తెలిసిందే. బెంగళూరు విషయంలో ఇదే జరుగుతోంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి వసతి కల్పించలేకపోతోంది. సరైన సరఫరా వ్యవస్థ లేకపోవడం బెంగళూరుకు శాపంగా మారుతోంది. దీంతో చాలావరకు నీళ్లు వృథాగా పోవడమో - కాలుష్యం బారిన పడటమో జరుగుతున్నది. సిటీ ఆఫ్ లేక్స్‌గా పేరున్నా.. ఒక్క చెరువులోని నీరు కూడా మానవ అవసరాలకు వాడుకొనే పరిస్థితి లేదు.
మరోవైపు కావేరీ నదీ జలాల తీర్పు నేపథ్యంలో కర్ణాటకలో సంబురాలు చేసుకుంటుంటే.. తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడుకు ఇవ్వాల్సిన వాటాను తగ్గించి.. కర్ణాటకకు 14.75 టీఎంసీల నీటిని అధికంగా వాడుకునేలా సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. దీంతో కర్ణాటక శాసనసభలో ఎమ్మెల్యేలు సంబురాలు చేసుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న బెంగళూరు నగరానికి శాశ్వత నీటి పరిష్కారం లభించడంతో.. అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయ నాయకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ర్టాల మధ్య ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.