కేంద్రానికి సుప్రీం జరిమానా ..ఎంతంటే?

Update: 2021-02-06 05:45 GMT
కోర్టు ముందు సాధారణ ప్రజలైనా, ప్రభుత్వమైనా ఒక్కటే. కోర్టు ముందు అందరూ సమానులే. తప్పు చేస్తే శిక్ష తప్పదు.  న్యాయంగా తీర్పు ఇవ్వడమే న్యాయస్థానాల ముందున్న లక్ష్యం. అందుకే కేంద్ర ప్రభుత్వానికి కూడా జరిమానా వేసింది కోర్టు. జరిమానాకు ముందు మాటలతో మొట్టికాయలు కూడా వేసింది. అప్పీల్‌ దాఖలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం, అసమర్థతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

సెంట్రల్‌ టిబెటన్‌ స్కూల్‌ అడ్మినిస్ట్రేన్‌లో ఉద్యోగుల  పే స్కేల్‌లో వ్యత్యాసాలపై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి గడువు తీరిన తర్వాత అప్పీల్‌ దాఖలు చేసినందుకు రూ.లక్ష జరిమానా విధించింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన 90 రోజులలోగా సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్రం 532 రోజుల తర్వాత అప్పీల్‌ చేసింది. ఈ విషయంలో  కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఒక లక్ష జరిమానా విధించింది. 
Tags:    

Similar News