పాలమూరు -రంగారెడ్డి నీటి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాగునీటి అవసరాల మేర ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని తెలిపింది. ఇది 7.15 టీఎంసీలు మాత్రమే ఉండాలని షరతు విధించింది. నీటి ఎద్దడి ఏర్పడినందున, ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు అనుమతి ఇచ్చిన వరకే నిర్మించాలని పేర్కొంది. గతంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతులు తీసుకోలేదని, నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపట్టిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.500 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో జరిమానాపై స్టే విధించి అనుమతుల మేర పనులు కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే ప్రతివాదులు అఫిడవిట్ లు దాఖలు చేయాలని ఆదేశించింది.
రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్ ను స్వీకరించిన కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన ధర్మాసనాన్ని ఆదేశించింది. వీరు పరిశీలించిన అనంతరం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పాక్షికంగా అనుమతులు ఇవ్వొచ్చునని తీర్పు వెలువరించారు. ప్రజలకు తాగునీటి అవసరాలు తీవ్రంగా ఉన్నందున ఆ మేరకు మాత్రమే పనులు నిర్వహించుకోవచ్చన్నారు. అయితే మొత్తం పనులపై అపిఢవిట్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది.
ఈ అఫిడవిట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత అభిప్రాయాలు తెలియజేయనడానికి మరో ఆరువారాల గడువు కూడా ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగష్టుకు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గత నెలలో సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రెండు వారాలకు వాయిదా వేసింది.
నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణకు రాకముందే పాలమూరు ప్రాజెక్టు పనులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అవినీటి అక్రమాలపై విచారణ జరిపేందుకు రెండు వారాల సమయం ఉండడంతో ఆలోపు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆలోపు ఈ ప్రాజెక్టు పనులు అనుమతి మేర పూర్తి చేస్తుందా? అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.