వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. తనను ఏడాది పాటు సస్పెండ్ చేసిన అంశంలో అసెంబ్లీ ప్రివేలేజ్ కమిటీ ముందు హాజరై రోజా వాదనలు వినిపించిన మరుసటి రోజే ఇంకో కీలక పరిణామం చోటుచేసుకుంది. సస్పెన్షన్ పై తనకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును రోజా ఆశ్రయించిన కేసులో నేడు విచారణ కొనసాగింది.
ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేయడానికి గల కారణాలను తెలపాలని ఆదేశిస్తూ అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇటు న్యాయపోరాటం - అటు అసెంబ్లీ కమిటీ ముందు విచారణ నేపథ్యంలో రోజా సస్పెన్షన్ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.