దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తాజాగా ఆసక్తికర తీర్పును ఇచ్చింది. మొన్నటికి మొన్న సినిమాహాళ్లలో సినిమా ప్రారంభంలో జాతీయ గీతాలాపన తప్పనిసరి అంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు నేపథ్యంలో ఒక న్యాయవాది తాజాగా సుప్రీంలో ఒక పిటీషన్ దాఖలు చేశారు. సినిమా హాళ్లలో ఏ విధంగా అయితే.. షో ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన తప్పనిసరి చేశారో.. కోర్టుల్లో కూడా జనగణమనను తప్పనిసరి చేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. పిటీషనర్ కోరుకున్నట్లుగా జాతీయ గీతాన్ని ఆలపించే అంశంపై సాధ్యం కాదని తేల్చేసింది. ఈ పిటీషన్ పై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టుకు బదులిచ్చేక్రమంలో.. ‘‘ఈ వ్యాజ్యం అసమగ్రంగా ఉందని.. వివరాలు సరిగా లేవని’’ తేల్చారు. దీంతో.. కోర్టుల్లో జనగణమనను తప్పని సరి చేయాలంటూ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పును ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/