భారతదేశంలో ఎవరితో పెట్టుకున్నా లేకున్నా.. కోర్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎలాంటి రాజీలు లేకుండా పని చేసే న్యాయస్థానాల పుణ్యమా అని తరచూ కోర్టులకు సంబంధించిన విషయాలు.. విశేషాలు ఇప్పుడు వార్తాంశాలుగా మారిపోతున్నాయి. తాజాగా.. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మండిపడిన సుప్రీంకోర్టు ఊహించని విదంగా వ్యవహరించింది. ఒక కేసుకు సంబంధించి రియాక్ట్ అవుతున్న తీరు ఏ మాత్రం సరిగా లేకపోవటంతో.. కేంద్రానికి రూ.25వేలు ఫైన్ వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.
కేంద్రసర్కారుకు సుప్రీంకోర్టు జరిమానా విధించటం ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. అమాయక మహిళల్ని అనాగరికంగా దేవదాసీలుగా (జీవితాంతం గుడికి సేవకులుగా ఉండిపోయేలా) మార్చే ప్రక్రియ మీద.. కేంద్రం తీసుకుంటున్న చర్యల మీద సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. అయితే.. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవటంతో అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది.
కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. పాతిక వేల రూపాయిలు జరిమానా విధించింది. అనంతరం ఈ కేసునకు సంబంధించిన తదుపరి విచారణ జనవరి 8 జరుగుతుందని.. అప్పటికి కేంద్రం సరైన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హరి.. ఆ గడువు లోపుల అయినా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా..?